Temples: ప్రస్తుత కాలంలో అందరిదీ ప్రాక్టికల్ జీవితం అయిపోయింది. చాలామందిలో ఆధ్యాత్మిక భావన తగ్గిపోతుంది. దీంతో కొందరు దేవుడు, దేవాలయాలు అంటే ఇష్టం లేకుండా పోతున్నారు. కానీ కొందరు సాంప్రదాయవాదులు మాత్రం ఆచారాలను కొనసాగిస్తున్నారు. వారి పద్ధతుల ద్వారా ఇతరులను కూడా ఆలయాలకు వెళ్లే విధంగా తోడ్పడుతున్నారు. ఈ క్రమంలో కొందరికి సందేహం వస్తోంది. అసలు దేవాలయాలకు ఎందుకు వెళ్లాలి? దేవాలయాలకు వెళ్లడం ద్వారా ఏం జరుగుతుంది? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఆలయాలకు వెళ్లడం ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం..
హిందూ సాంప్రదాయం ప్రకారం దేవుళ్లను విగ్రహాల రూపంలో చూస్తూ పూజిస్తారు. ఒక దేవుని యొక్క రూపంలో విగ్రహంగా మార్చి ఆలయాన్ని నిర్మిస్తారు. ఆలయం నిర్మించే సమయంలో ఎన్నో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలాగే విగ్రహం ప్రాణ ప్రతిష్ట చేసే సమయంలో అనేక మంత్రోచ్ఛారణలు చేస్తారు. ఇలా చేయడం వల్ల సాక్షాత్తు అక్కడ దేవతలే కొలువై ఉంటారని భక్తులు నమ్ముతారు. అయితే ఈ దేవుడిని దర్శించుకునేందుకు భక్తులు కొందరు ప్రతిరోజు ఆలయానికి వెళుతూ ఉంటారు. దేవాలయాలకు వెళ్లడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయంటే..?
దేవాలయాలకు వెళ్లాలంటే పాదరక్షలు ధరించవద్దు. అంటే వట్టికాలతో వెళ్లడం మంచిదని పెద్దలు చెబుతారు. ఇలా వెళ్లడం ద్వారా మట్టిలో వట్టికాలతో నడవడం వల్ల బ్లడ్ సర్కులేషన్ ఈజీ అవుతుంది. దీంతో కొన్ని అనారోగ్యాలకు ఇది ప్రభావం చూపుతుంది. అందువల్ల దీనిని ఇలా చేర్చారు.
ఆలయాలకు వెళ్లిన తర్వాత విగ్రహానికి ఎదురుగా గంట ఉంటుంది. ఈ గంటను మోగించడం ద్వారా 7 సెకండ్ల పాటు ధ్వని ప్రసరిస్తుంది. ఈ దని మనిషిలోని కుడి, ఎడమ భాగాల్లోని నాడుల్లో పనిచేసేలా ఉపయోగపడుతుంది. ధ్వని ప్రసారంతో శరీరంలోని కొన్ని కణాలు స్పందిస్తాయి. అందువల్ల ఆలయంలోకి వెళ్ళినప్పుడు గంటను మోగించాలని అంటారు.
దేవాలయానికి వెళ్ళినప్పుడు నుదుట కుంకుమ పెట్టుకుంటారు. రెండు కనుబొమ్మల మధ్య కుంకుమ పెట్టుకోవడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని భావిస్తారు. అలాగే మనసు ప్రశాంతంగా మారుతుందని చెబుతారు. అందువల్ల ఆలయాల్లో బొట్టు తప్పనిసరిగా ఉండాలని నియమాన్ని పెట్టారు.
ఇక ఆలయంలో తీర్థ ప్రసాదాలు కూడా ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆలయాల్లో ఎక్కువగా తీర్థం కోసం కొబ్బరి నీరును అందిస్తారు. దీనిని బరిగడుపున తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అలాగే ప్రసాదం కోసం కొబ్బరి, అరటి పండ్లను అందిస్తారు. ఇవి కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ఇలా దేవాలయాలకు వెళ్లడం ద్వారా అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అందువల్లే చాలామంది ఆలయాలకు వెళ్లడం ద్వారా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నామని చెబుతూ ఉంటారు. అంతేకాకుండా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుడిని కోరుకుంటే పరిష్కరిస్తారని అనుకుంటారు. అందుకు ప్రశాంతమైన వాతావరణం లో ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని నమ్మకం భక్తుల్లో ఉంటుంది. ఆలయాల్లో ప్రశాంతమైన వాతావరణఉండడం వల్ల ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతారు. అందువల్ల వారానికి ఒకసారి అయినా ఆలయానికి వెళ్లాలని చెబుతూ ఉంటారు. ఆలయంలో ఉండే స్వచ్ఛమైన వాతావరణంతో ఎంతో అదనపు శక్తి లభిస్తుందని చెబుతారు.