NTR: ఎన్టీఆర్ ఆత్మ 16 ఏళ్ల అమ్మాయిలో ప్రవేశించిందట !

NTR: దివంగత మాజీ ముఖ్యమంత్రి, సినీ నటులు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. అయితే, లక్ష్మీ పార్వతి నివాళులు అర్పించాక చేసిన కామెంట్స్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి. లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ..‘‘26 ఏళ్ల తర్వాత ఒక రహస్యం చెబుతున్నాను. ఎన్టీఆర్ గారు చనిపోయినప్పుడు ఆయన ఆత్మతో మాట్లాడాను. అప్పట్లో జీవిత రాజశేఖర్‌లు మద్రాస్ తీసుకెళ్లి ఒక అమ్మాయితో మాట్లాడించారు. ఎన్టీఆర్ గారి ఆత్మ 16 ఏళ్ల అమ్మాయిలో […]

Written By: Shiva, Updated On : January 18, 2022 11:15 am
Follow us on

NTR: దివంగత మాజీ ముఖ్యమంత్రి, సినీ నటులు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. అయితే, లక్ష్మీ పార్వతి నివాళులు అర్పించాక చేసిన కామెంట్స్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి. లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ..‘‘26 ఏళ్ల తర్వాత ఒక రహస్యం చెబుతున్నాను. ఎన్టీఆర్ గారు చనిపోయినప్పుడు ఆయన ఆత్మతో మాట్లాడాను. అప్పట్లో జీవిత రాజశేఖర్‌లు మద్రాస్ తీసుకెళ్లి ఒక అమ్మాయితో మాట్లాడించారు. ఎన్టీఆర్ గారి ఆత్మ 16 ఏళ్ల అమ్మాయిలో ప్రవేశించి నాతో అనేక విషయాలు పంచుకుంది’ అంటూ లక్ష్మీ పార్వతి చెప్పుకొచ్చింది.

NTR

అయితే, లక్ష్మీ పార్వతి వ్యాఖ్యల పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. లక్ష్మీ పార్వతి గారికి వయసు అయిపోయినా ఇంకా ఆమెలో కళలు తగ్గలేదు అని, ఆమె తన వయసుకు తగ్గట్లు మాట్లాడితే బాగుంటుంది అని, అసలు ఆమె చూపులే మంచివి కావు అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. ఇక పనిలో పనిగా ఏపీలో ఎన్టీఆర్ విగ్రహాలపై దాడుల చేసి ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేసి సీఎం జగన్ హుందాగా వ్యవహరించారని లక్ష్మీ పార్వతి చెప్పుకొచ్చింది.

Also Read: కట్టుకున్న భార్యపై అనుమానం.. ఈ భర్త ఏం చేశాడో తెలుసా?

ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలయ్య నివాళులర్పించి మాట్లాడుతూ.. ‘మనకు ఆదర్శంగా నిలిచిన తెలుగుజాతి ముద్దుబిడ్డ ఎన్టీఆర్. సినీ, రాజకీయ రంగాల్లో ఎంతోమందికి స్ఫూర్తినిచ్చారు. తెలుగు జాతి ఉన్నంతకాలం ఆయన ఉంటారు’ అని బాలయ్య కామెంట్స్ చేశాడు. ఏది ఏమైనా ఎన్టీఆర్ మహా మనిషి. ఆయన చల్లని చూపు తెలుగు ప్రజలపై ఉండాలని, ముఖ్యమంత్రుల హృదయాల్లో ఎన్టీఆర్ ఆత్మ ప్రవేశించి ప్రజలకు మంచి చేయాలని కోరుకుందాం .

Also Read: ఇంట్లో వ‌స్తువులు చెద‌లు ప‌ట్టాయా.. జీవితంలో ఈ ఇబ్బందులు త‌ప్ప‌వు..!

Tags