TDP-Janasena: సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. దీంతో పార్టీల్లో అప్పుడే కలవరం మొదలైంది. విజయంపై ఆశలు ఉన్నా ఎవరి భయం వారికి పట్టుకుంది. పార్టీల్లో కోవర్టులు పెరిగిపోతున్నారంటూ తెలుగుదేశం, జనసేన పార్టీల అధినేతలు చెబుతుండటం విశేషం. దీంతో వారెవరో కూడా తెలుసని చెబుతున్నా వారిని ఎందుకు పార్టీలో ఉండనిస్తున్నారు. బయటకు పంపొచ్చు కదా అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. దీంతో వారిపై చర్యలు ఉంటాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీల్లో అప్పుడే గుసగుసలు మొదలయ్యాయి. టీడీపీ, జనసేన పార్టీల్లో తమ ప్రయోజనాల కోసం పనిచేయకుండా ప్రత్యర్థి పార్టీలకు మద్దతు తెలుపుతున్నారనే వాదనలు వినిపిస్తున్నారు.

రాబోయే ఎన్నికల్లో పొత్తులుండటం ఖాయంగా కనిపిస్తోంది. చంద్రబాబు ఇప్పటికే పొత్తులపై ఓ అంచనాకు వస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీని ఎదుర్కోవాలంటే పొత్తు తప్పనిసరని తెలుస్తోంది. అందుకే అటు బీజేపీ ఇటు జనసేనతో పొత్తు పెట్టుకునేందుకే నిర్ణయించుకున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటికే టీడీపీలో నేతల ప్రక్షాళన జరగాలని కార్యకర్తల్లో కూడా డిమాండ్ వస్తోంది. దీనిపై కూడా చంద్రబాబు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
Also Read: Vijayawada TDP: విజయవాడ టీడీపీలో ఏం జరుగుతోంది?
చంద్రబాబు, పవన్ ఉద్దేశాలు ఒక్కటైనా మాటలు వేరుగా ఉన్నాయి. కోవర్టుల విషయంలో కఠిన చర్యలుంటాయని చెబుతున్నా ఆ దిశగా ఆలోచించడం లేదు. దీంతో వారి మాటలు వట్టివేనా అనే అనుమానాలు సైతం వస్తున్నాయి. రెండు పార్టీల్లో అధికారం దక్కించుకోవాలనే ఆరాటం స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు వైసీపీ కూడా బలంగానే ఉండటంతో ఏపీలో అధికారం అంత సులువు కాదనే విషయం వారికి అర్థం కావడం లేదు. ఈక్రమంలో రెండు పార్టీలు ఏం చర్యలు చేపడతాయో తెలియడం లేదు. ఇప్పటికే రాజకీయ వేడి రాజుకుంటోంది. పార్టీల్లో మెల్లగా ప్రచార వేడి పెరుగుతోంది.
దేశంలో ముందస్తు ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది. మరోవైపు జమిలి ఎన్నికలకు వెళ్లాలని కేంద్రం చూస్తోంది. దీంతో కేంద్రం ఏం చర్యలు తీసుకుంటోందో తెలియడం లేదు. మూడోసారి అధికారం కోసం వేచి ఉన్న బీజేపీలో కూడా ఏం నిర్ణయాలు తీసుకుంటారో తెలియడం లేదు. దీంతో ఏపీలో పరిణామాలపై ఇప్పటికే బీజేపీ ఓ అంచనాకు వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే ఎన్నికల నాటికి పార్టీల్లో ఏం మార్పులు ఉంటాయో కూడా అర్థం కావడం లేదు.
Also Read: Janasena: సిగ్గూ లజ్జ ఉండవా? వైసీపీ మంత్రి పేర్నినానిపై జనసేన ప్రధాన కార్యదర్శి సంచలన ఆరోపణలు