Homeఎంటర్టైన్మెంట్Lakshmi Pranathi: లవ్లీ భర్తతో ఫస్ట్ ట్వీట్ అంటూ ఎన్టీఆర్ సతీమణి !

Lakshmi Pranathi: లవ్లీ భర్తతో ఫస్ట్ ట్వీట్ అంటూ ఎన్టీఆర్ సతీమణి !

Lakshmi Pranathi:  ఫస్ట్ ట్వీట్ నా లవ్లీ భర్తతో అని జూనియర్ ఎన్టీఆర్ సతీమణి ప్రణతి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే స్టార్ స్టార్ హీరోలు భార్యలు తమ భర్త కు , ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను, విశేషాలను తమ భర్తల ఫ్యాన్స్ తో పంచుకుంటూ అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతున్నారు. మహేష్ బాబు సతీమణి నమ్రత, రామ్ చరణ్ సతీమణి ఉపాసన, అల్లు అర్జున్ సతీమణి స్నేహ ఇలా చాలా మంది స్టార్ హీరోలు భార్యలు […]

Lakshmi Pranathi:  ఫస్ట్ ట్వీట్ నా లవ్లీ భర్తతో అని జూనియర్ ఎన్టీఆర్ సతీమణి ప్రణతి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే స్టార్ స్టార్ హీరోలు భార్యలు తమ భర్త కు , ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను, విశేషాలను తమ భర్తల ఫ్యాన్స్ తో పంచుకుంటూ అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతున్నారు. మహేష్ బాబు సతీమణి నమ్రత, రామ్ చరణ్ సతీమణి ఉపాసన, అల్లు అర్జున్ సతీమణి స్నేహ ఇలా చాలా మంది స్టార్ హీరోలు భార్యలు సోషల్ మీడియాలో చాలా బాగా యాక్టివ్ గా ఉన్నారు.

Lakshmi Pranathi:
Lakshmi Pranathi:

అయితే తాజాగా ఈ లిస్టు లోకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి జాయిన్ అయింది. తాజాగా ప్రణతి సోషల్ మీడియాలో అడుగు పెడుతూనే.. ఎన్‌టీఆర్‌ కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది. ఆ ఫోటోతో పాటు ‘మీ అందరితో కలిసి ట్విటర్‌లో జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది అని, నా మొదటి ట్వీట్ నా లవ్లీ భర్తతో పోస్ట్ చేస్తున్నాను’ అంటూ ప్రణతి తన భర్త ఎన్టీఆర్ ట్యాగ్ చేయడం విశేషం.

Also Read: కొత్త జిల్లాలతోనే ఏపీకి మూడు రాజధానులు!

ఇప్పటివరకు సోషల్ మీడియాకు, లైమ్‌ లైట్‌ కు దూరంగా ఉన్న ప్రణతి ఒక్కసారిగా ట్విటర్‌లో అడుగుపెట్టడం అందరికి షాక్ ఇచ్చింది. ఇక లక్ష్మి ప్రణతి ట్విటర్‌ లో అడుగుపెట్టిన గంటల్లోనే వేల సంఖ్యలో ఫాలోవర్స్‌ ను సొంతం చేసుకోవడం విశేషం. కాగా ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి ఇప్పటివరకు పెద్దగా బయటికి రాలేదు. పెళ్లయిన కొత్తలో ఎన్టీఆర్ తో కలిసి తన సినిమాల ఫంక్షన్లలో కొన్ని సందర్భాల్లో సందడి చేసింది. పిల్లలు పుట్టాక, ఫ్యామిలీతో ఫుల్ టైం గడుపుతుంది. అప్పుడప్పుడు ఫ్యామిలీ ఫోటోస్‌లో మాత్రమే కనిపిస్తుంటుంది.

Lakshmi Pranathi:
Lakshmi Pranathi:

అయితే ప్రణతి తాజాగా ట్విటర్‌లో అకౌంట్‌ను ఓపెన్ చేయడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక నుంచి ఎన్టీఆర్ కి సంబంధించిన అన్నీ అప్ డేట్స్ ను ఆమె రివీల్ చేస్తోందని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

Also Read:  మాఘ అమావాస్య రోజు ఏ రాశి వారు ఏ వస్తువులను దానం చేస్తే.. ఎలాంటి ఫలితం కలుగుతుందో తెలుసా?

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper