నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీలో టెట్ ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులు టెట్ నోటిఫికేషన్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ టీచర్ కు ఎంతో క్రేజ్ ఉంది కాబట్టి లక్షల సంఖ్యలో నిరుద్యోగులు ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్లడానికి అవసరమైన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ లో అర్హత సాధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే నిరుద్యోగులకు ఏపీలో ఉన్న జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. Also Read: టీఎస్ నిరుద్యోగులకు శుభవార్త.. 127 ఉద్యోగాలకు నోటిఫికేషన్..? మే నెలలో […]

Written By: Navya, Updated On : April 3, 2021 3:39 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులు టెట్ నోటిఫికేషన్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ టీచర్ కు ఎంతో క్రేజ్ ఉంది కాబట్టి లక్షల సంఖ్యలో నిరుద్యోగులు ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్లడానికి అవసరమైన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ లో అర్హత సాధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే నిరుద్యోగులకు ఏపీలో ఉన్న జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది.

Also Read: టీఎస్ నిరుద్యోగులకు శుభవార్త.. 127 ఉద్యోగాలకు నోటిఫికేషన్..?

మే నెలలో టెట్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేయడానికి జగన్ సర్కార్ సిద్ధమవుతోంది. టెట్ నోటిఫికేషన్ విడుదలైన కొన్ని రోజుల్లోనే పరీక్ష నిర్వహించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. గతంలో టెట్ పరీక్షకు అర్హత గుర్తింపు ఏడు సంవత్సరాలుగా ఉండగా ప్రస్తుతం ఒకసారి టెట్ లో అర్హత సాధిస్తే సరిపోతుంది. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బోధించాలనుకునే వారు ఎస్‌జీటీ పేపర్‌ – 1ఏ, ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధించేవారు పేపర్‌– 2ఏ రాయాల్సి ఉంటుందని సమాచారం.

ఎవరైతే టెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తారో వారికి ఉపాధ్యాయ నియామక పోస్టుల్లో 20 శాతం వెయిటేజీ లభిస్తుంది. టెట్ పరీక్షలో అర్హత సాధిస్తే మాత్రమే నిరుద్యోగ అభ్యర్థులు డీఎస్సీ పరీక్ష రాయడానికి అర్హులవుతారు. డీఎస్సీ పరీక్ష రాసి అర్హత సాధిస్తే మాత్రమే ప్రభుత్వ జిల్లా, మండల పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో టీచర్ జాబ్ లో చేరడానికి అర్హులు.

Also Read: 224 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. భారీ వేతనంతో..?

రాష్ట్రంలో టెట్ పరీక్షను ఆన్ లైన్ లో నిర్వహిస్తారు. అర్హత ఉన్నవారు ఎస్‌జీటీ పేపర్ 1ఏ, స్కూల్‌ అసిస్టెంట్ పేపర్ 2ఏ పరీక్షలకు హాజరవుతారు. రెగ్యులర్ స్కూల్స్ లో పోటీ పడాలనుకునే అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుందని తెలుస్తోంది.