AP-Telangana: కేంద్రం ఆంధ్రప్రదేశ్ విబజన చట్టంలోని అంశాలను పరిష్కరించేందుకు నిర్వహించిన సమావేశంలో తెలంగాణ పైచేయి సాధించింది. ఇన్నాళ్లుగా ఊరిస్తూ వచ్చిన కేంద్రం ఎట్టకేలకు విబజన హామీలు నెరవేర్చాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే గురువారం సమావేశం నిర్వహించింది. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. తమ సమస్యలు ఏకరువు పెట్టారు. తమకు రావాల్సిన బకాయిల గురించి విన్నవించాయి. దీంతో తెలంగాణ మాత్రం తన డిమాండ్లు నెరవేర్చుకోవాలని చూసింది.
తెలంగాణ స్టేట్ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ లిమిటెడ్ కు రూ.354 కోట్ల బకాయిలు చెల్లించేందుకు ఒప్పుకుంది. మొత్తం ఐదు అంశాలను మాత్రమే ఎజెండాలో పెట్టారు. దీంతో అందులో ఒకటి ఉమ్మడి అంశం కాకపోవడంతో దాన్ని తొలగించారు. మిగిలిన నాలుగు అంశాలపై చర్చించారు. విద్యుత్ బకాయిల విషయంలో తెలంగాణ కోర్టు కేసులను కారణంగా చూపిస్తోంది.
Also Read: మూడో కూటమిలో జగన్ చేరతారా? కేసీఆర్ తో కలుస్తారా?
ఏపీకి రావాల్సిన బకాయిల విషయంలో కోర్టులో కేసులు వేయడంతోనే సమస్య ముదిరిందని అభిప్రాయపడింది. లేదంటే ఎప్పుడో పంచాయితీ తెగేదని సూచించింది. ఏపీకి నిధులు రావాలని వారంటుంటే మాకే రావాలని తెలంగాణ వాదిస్తోంది. దీంతో విద్యుత్ బకాయిల విషయంలో మాత్రం ఏకాభిప్రాయం రావడం లేదు. దీంతో నిధుల గొడవ ఇప్పట్లో తేలేలా లేదు.
మొత్తానికి ఏపీ, తెలంగాణ మధ్య నిధుల వివాదం కుదిరేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో చట్టాలను మార్చాలని ఏపీ వాదిస్తోంది. చర్చలు ఎన్నిసార్లు జరిగినా సమస్య కొలిక్కి రావడం లేదు. దీంతో చట్టాల్లోనే మార్పులు తెచ్చేలా చూడాలని సూచిస్తున్నా అది సాధ్యం కావడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో విభజన చట్టాలు సమస్యలను తీర్చేలా లేవని చెబుతున్నారు. దీంతో మరోమారు సమావేశం అయితే కానీ చర్చలు ఫలప్రదం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
Also Read: అప్పుడే పవన్ కళ్యాణ్ కు సీఎం ఛాన్స్.. కానీ ఈ సింపుల్ లాజిక్ గుర్తిస్తేనే?