Vangaveeti Mohana Ranga: ఏపీలో ఇప్పుడు పేర్ల రాజకీయం నడుస్తున్న విషయం తెలిసిందే. ఎప్పుడైతే జగన్ ప్రభుత్వం కొత్త జిల్లాలను ప్రకటించిందో అప్పటి నుంచే కొన్ని జిల్లాలకు కొందరి పేర్లు పెట్టాలంటూ అటు టీడీపీ, బీజేపీలతో పాటు.. ఇటు ప్రజల నుంచి కూడా కూడా విమర్శలే వస్తున్నాయి. అయితే వైసీపీ కావాలనే పేర్ల రాజకీయానికి తెరలేపింది కాబట్టి.. తాము కూడా ఇదే రాజకీయంలో కౌంటర్ వేయాలని టీడీపీ భావిస్తోంది. ఇందులో భాగంగానే బొండా ఉమా మరో రాజకీయానికి తెర లేపారు.

కృష్ణా జిల్లాకు రంగా పేరు పెట్టాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కృష్ణా జిల్లాను రెండుగా విడగొట్టారు. ఇందులో విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారు. మచిలీపట్నం పేరుతో మరో జిల్లా ఉంది. ఇందులో ఎన్టీఆర్ పుట్టిన ఊరు మచిలీపట్నంలో ఉంది కాబట్టి రెండు జిల్లాల్లో ఒక దానికి ఎన్టీఆర్ పేరు పెట్టి, మరొక దానికి వంగవీటి రంగా పేరు పెట్టాలని ఆయన పట్టు బడుతున్నారు. దీంతో సరికొత్త వివాదం తెరమీదకు వచ్చినట్టు అయింది.
Also Read: చంద్రబాబు మదిలో కొత్త వ్యూహం.. పదును పెడితే జగన్‌కు ఇరకాటమే..!
ఇప్పటి వరకు ఒక జిల్లాకు కూడా అంబేడ్కర్ పేరు పెట్టకుండా ఆయన్ను అవమానించారంటూ వైసీపీ మీద దాడికి దిగింది టీడీపీ. ఇప్పుడేమో రంగా పేరును పెట్టాలని ఉమా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం ఆయన ధర్నా చౌక్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోలన చేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఇక అవసరమైతే జగన్ నివాసాన్ని కూడా ముట్టడిస్తామంటూ హెచ్చరిస్తున్నారు. కాగా ఇందులోకి కొడాలి నాని, వల్లభనేని వంశీలన కూడా లాగుతున్నారు.

వీరిద్దరూ జగన్‌కు ఒక మాట చెబితే ఆయన రంగా పేరు పెడతారంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అంటే వారిద్దరూ చెప్పకపోవడం వల్లే రంగా పేరు పెట్టట్లేదని ఇన్ డైరెక్టుగా చెబుతున్నారన్నమాట. ఇప్పుడు రంగా పేరు పెట్టకపోతే జగన్‌కు అదో సమస్య వస్తుంది. కాపులకు ఐకాన్ లాంటి రంగా పేరు మీద రాజకీయం చేస్తే.. కాపుల్లో జగన్ మీద వ్యతిరేకత వస్తుందనేది టీడీపీ ప్లాన్ అన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా జగన్‌ను ఇరకాటంలో పడేసేలా చేస్తున్నారు బొండా ఉమా.
Also Read: ఏది చేద్దామన్నా బెడిసికొడుతోందే.. టీడీపీ పరిస్థితి ఇలా అయిందేంటి..?
దాంతో పాటు అటు మంత్రి కొడాలి నానిని కూడా ఇందులోకి లాగి.. అగ్గి రాజేస్తున్నారు. ఇప్పుడు కొడాలి నాని కూడా తప్పనిసరిగా స్పందించాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఎటు పెట్టినా ఇది చాలా సున్నితమైన అంశం. కాబట్టి జగన్ ప్రభుత్వం దీన్ని ఎలా ఎదుర్కుంటుందో అనేది వేచి ఊడాలి.