Tollywood Heroes: బాలీవుడ్ నుంచి అద్భుతమైన ఆఫర్లను తిరస్కరించిన సౌత్ సూపర్ స్టార్లు కొందరు ఉన్నారు. నిజానికి బాలీవుడ్ లో నటించాలని చాలామంది సౌత్ స్టార్స్ కి కోరిక ఉంటుంది. మరి ఎందుకు.. బాలీవుడ్ సినిమాలను రిజెక్ట్ చేశారు ? ఈ లిస్ట్ లో అల్లు అర్జున్, రష్మిక మందన్న నుంచి విజయ్ దేవరకొండ ఉండటం నిజంగా విశేషమే. మరి సౌత్ సూపర్ స్టార్స్ తిరస్కరించిన బాలీవుడ్ చిత్రాలను ఇక్కడ చూడండి.
‘బజరంగీ భాయిజాన్’ని తిరస్కరించిన అల్లు అర్జున్

అల్లు అర్జున్ కి తన కెరీర్ లో మంచి బ్లాక్ బస్టర్‌లు ఉన్నాయి. అయితే, బాలీవుడ్ నుంచి ఆ మధ్య బన్నీకి ఒక మంచి ఆఫర్ వచ్చింది. ‘బజరంగీ భాయిజాన్’ లాంటి సక్సెస్ ఫుల్ ఎంటర్‌టైనర్‌లో సల్మాన్ ఖాన్ కి ముందు, కబీర్ ఖాన్.. అల్లు అర్జున్‌ని సంప్రదించాడు. అయితే, బన్నీ అప్పుడు ఫుల్ బిజీగా ఉండటం చేత ‘బజరంగీ భాయిజాన్’ కోసం సైన్ చేయలేకపోయాడు.
Also Read: రంగా పేరుతో రాజకీయం.. ఓ జిల్లాకు ఆయన పేరు పెట్టాలంటున్న టీడీపీ..!
‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ని తిరస్కరించిన నయనతార

అట్లీ తదుపరి చిత్రంలో షారుఖ్ ఖాన్ సరసన నయనతార రొమాన్స్ చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ సౌత్ బ్యూటీ గతంలో షారుఖ్ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లో నటించాలి. కానీ, ఆ సినిమా తిరస్కరించిందని మీకు తెలుసా? ఈ చిత్రంలో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుండగా, దర్శకుడు రోహిత్ శెట్టి ‘వన్ టూ త్రీ ఫోర్’ అనే హిట్ పాటను నయనతారకు ఆఫర్ చేశాడు. నయనతార చేయలేదు. దాంతో.. మేకర్స్ ప్రియమణిని ఎంపిక చేసుకున్నారు.
‘జెర్సీ’ని తిరస్కరించిన రష్మిక మందన్న

రష్మిక మందన్న ‘మిషన్ మజ్ను’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది, అయితే అంతకు ముందు, ఈ బ్యూటీకి షాహిద్ కపూర్ సరసన ‘జెర్సీ’ ఆఫర్ వచ్చింది. ఆ ఆఫర్ ను రష్మిక తిరస్కరించింది. కారణం.. కమర్షియల్ సినిమాలే చేయాలనే నియమం పెట్టుకుందట.
‘డియర్ కామ్రేడ్’ని తిరస్కరించిన విజయ్ దేవరకొండ

ఇక ‘లైగర్’ కంటే ముందు, కరణ్ జోహార్ ‘డియర్ కామ్రేడ్’ సినిమాను విజయ్ దేవరకొండతో హిందీలో రీమేక్ చేయాలనుకున్నాడు. పైగా కరణ్ జోహార్ ‘డియర్ కామ్రేడ్’ రైట్స్ ను దాదాపు 6 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశాడు. కానీ, విజయ్ దేవరకొండ ఈ రీమేక్‌ను తిరస్కరించాడు. ఒకే కథను రెండుసార్లు చెప్పడం తనకు ఇష్టం లేదని చెప్పాడు.
మొత్తానికి మన స్టార్ హీరోలు హీరోయిన్లు కొన్ని అద్భుతమైన హిందీ ఆఫర్లను వదులుకున్నారు. అయితే, విచిత్రంగా ఎవరు అయితే.. హిందీ ఆఫర్లను కాదు అనుకున్నారో.. వాళ్లతోనే బాలీవుడ్ మేకర్స్ మళ్ళీ సినిమాలు చేస్తున్నారు.
Also Read: మోడీ దిష్టబొమ్మల దహనాలు.. మొదలైన టీఆర్ఎస్ నిరసనలు.
[…] Pooja Hegde: అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ దర్శకుడిగా మారిన సందీప్ వంగ.. బాలీవుడ్‌లో రణబీర్ కపూర్‌తో ‘యానిమల్’ సినిమాను చేస్తున్నాడు. పైగా క్రియేటివ్ డైరెక్టర్ అనే పేరుతో పాటు బోల్డ్ డైరెక్టర్ గా అనే పేరును కూడా నేషనల్ రేంజ్ లో తెచ్చుకున్నాడు. మొత్తానికి ఒక్క సినిమానే రెండుసార్లు తీసి నేషనల్ డైరెక్టర్ రేంజ్ గుర్తింపు తెచ్చుకోవడం ఒక్క సందీప్ రెడ్డికే సాధ్యం అయింది అనుకుంటా. ఇక తన కొత్త సినిమాని బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే. […]
[…] Also Read: బాలీవుడ్ క్రేజీ ఆఫర్లు రిజెక్ట్ చేసి… […]