Pawan Kalyan vs Jagan: అభిమానం, ఇష్టమున్న చోట ఇబ్బందులు కనిపించవు. ఒక వేళ కనిపించినా సర్దుకొని వెళతాం. ఆ తరువాత కూడా అవి కంటిన్యూ అయితే బాధపడతాం. మరీ తీవ్రమైతే నొచ్చుకుంటాం. చివరకు ఇది మంచి పద్దతి కాదని తిరగబడతాం. ఇప్పడు ఏపీలో పొలిటికల్ సిట్యువేషన్ సేమ్ అలానే ఉంది. జగన్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ‘ఏం చేస్తున్నాడురా’ అని భావించాం. తరువాత ‘ఏదో చేస్తున్నాడులే’ అని సర్దుకున్నాం. ఇప్పుడు ‘అలా చేస్తున్నాడేంటి?’ అని బాధపడుతున్నాం. జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలు అందుకున్న వారి మదిలోనూ కూడా ఇలానే ఉంది. అన్నివర్గాల ప్రజల్లో కూడా ఇటువంటి భావనే నెలకొని ఉంది. అయితే రాజకీయాల్లో మనం చేసే మంచి పనులు సత్ఫలితాలనిస్తాయి. చెడు పనులు మాత్రం ఎదురు తిరుగుతాయి. మనం మంచి చేస్తే మంచే ఎదురవుతుంది. ఎదుటివాడికి హాని తలపెట్టినా.. మోసం చేసినా లైఫ్ లో ఎప్పుడో వాటిని ఫేస్ చేయ్యాల్సి ఉంటుంది. అటువంటి సమయంలో కొందరు రియలైజ్ అవుతారు. మరికొందరు తప్పులు తెలుసుకోకుండా.. ఇంకా చేస్తూనే ఉంటారు. అయితే ఇటువంటి వారు తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరు.

సీఎం జగన్ పదవిలో రాకముందే ఎన్నో వికృత చేష్టలకు పాల్పడ్డారు. ఆయన చేసిన ప్రయోగాలు, ఉద్యమాలు అన్నీఇన్నీ కావు. అవన్నీ ఇప్పుడు రివర్స్ కావడం ప్రారంభమయ్యాయి. సహజంగా పవర్ పొగొట్టుకున్న తరువాతే ఇటువంటివి ఫేస్ చెయ్యాల్సి ఉంటుంది. అయితే జగన్ చేసిన రాచకార్యాలు కాబట్టి అధికారంలో ఉండగానే రివర్స్ అవుతున్నాయి. రాష్ట్రానికి, ప్రజలకు, వ్యవస్థలకు, నాయకులకు ఆయన ఏమేం చేశారో.. అన్ని ఆయన ముందు వాలిపోతున్నాయి. ఎదురెళ్లి మరీ ఇబ్బందిపెడుతున్నాయి. అయితే ఆయన గ్రహిస్తున్నారో..ఆ పార్టీ నేతలు గమనిస్తున్నారో తెలియదు. ఎందుకంటే పవర్ అనే మేనియాలో వారంతా ఉన్నారు. అధికారం మూడు దశాబ్దాల పాటు తమదే అన్న భ్రమలో ఉన్నారు. చేతిలో నుంచి పవర్ పోతే కానీ తత్వం బోధపడే పరిస్థితులు అక్కడ కనిపించడం లేదు.
పవన్ తాజా రియాక్షన్ తో వైసీపీకి తిరిగి కానుకలు ప్రారంభమయ్యాయి. తొలుత వారు ఇతరులకు ఎంత చదివించుకున్నారో.. వాటికి డబుల్ ఇచ్చి ఇతరులు చదివించుకోవడం ప్రారంభించారు. తప్పుడు ఆరోపణలు చేస్తే నా కొడకల్లారా చెప్పుతీసి కొడతానని పవన్ హెచ్చరించారు. కాదు చెప్పు చూపే డైరెక్టుగా మాట్లాడారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా పవన్ బరెస్టయ్యారు. అయితే దానికి మూల కారకులు ఎవరో అందరికీ తెలిసిందే. పవన్ సినిమా నటుడు, ఒక పార్టీకి అధ్యక్షుడైనంత మాత్రన ఆయనకు వ్యక్తిగత జీవితం ఉండదా? కానీ ఆయనపై వ్యక్తిగత హననానికి దిగుతున్నారు. పదేపదే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. దీనికి కారణం ప్రభుత్వ వైఫల్యాలను పవన్ ఎత్తిచూపుతుండడమే కారణం. అయితే దానికి రాజకీయ విమర్శలు, ఆరోపణలు చెయ్యాలే కానీ.. వ్యక్తిగత దాడి ఏంటి అన్న ప్రశ్న సహజం. పవన్ ను వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయ్యాలి. మానసికంగా దెబ్బ కొట్టాలి. అయితే దీని వెనుక ఉన్నది ఎవరో అందరికీ తెలుసు. అందుకే పవన్ స్ట్రైట్ గా చెప్పు చూపించి మరీ హెచ్చరించడంతో జగన్ బయటకు వచ్చారు. స్వాతిముత్యం పలుకులు వల్లెవేయడం ప్రారంభించారు. పవన్ ఉద్దేశించి ఇలాంటి వాళ్లా మన నాయకులు అంటూ ప్రశ్నలు వేయడం ప్రారంభించారు. ఇంతవరకూ అటువంటి రాజకీయాలే జరగలేదన్నట్టు బిల్డప్ ఇచ్చారు. ఇప్పుడే కోమాలోంచి బయటకు వచ్చిన పెషెంట్ లా సీఎం జగన్ మాట్లాడేసరికి ఆశ్చర్యపడడం రాష్ట్ర ప్రజల వంతైంది.

‘కులము కులమూ అన్న వ్యర్థమాటలెందుకు’ దానవీరశూర కర్ణ సినిమాలో ఎన్టీఆర్ పలికే పవర్ ఫుల్ డైలాగు ఇది. ఇప్పుడు ఏపీలో వైసీపీ పాలకులు కూడా ఇదే విధంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఎంటరైన తరువాతే బూతులు కూడా ఎంటరయ్యాయి. రాజకీయాలనే పొల్యూట్ చేశాయి. రాజకీయ విమర్శలంటే అమ్మలక్కలను బూతులు తిట్టడం, కుటుంబాలను బజారుకీడ్చడం, సోషల్ మీడియాలో దుష్ప్రచారం..ఇదే ఇప్పుడు నయా ట్రెండ్. బూతులంటేనే ఒక డజను మంది అధికార పార్టీ నాయకులు పేర్లు టక్కున చెప్పొచ్చు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేర్ని నాని, రోజా, దువ్వాడ శ్రీనివాస్ వంటి వారు నోరు తెరిస్తేనే బూతులు యథాలాపంగా వచ్చేస్తాయి. అయితే వీరి పూర్వశ్రమాల్లో వీరు ఎవరిని పల్లెత్తు మాట అనని విషయాన్ని గుర్తించుకోవాలి. ఇంతకు ముందు వీరు వేరే పార్టీలో ఉన్నప్పుడు ఇటువంటి కామెంట్స్ చేయలేదు. వైసీపీలోకి వచ్చాక వీరికి ఆ జీన్స్ ఆవహించాయి.
అయితే వైసీపీ నేతలను ఉసిగొల్పడం వెనుక ఎవరు ఉన్నారు? ఎవరు ప్రోత్సహిస్తున్నారు? అన్నది జగమెరిగిన సత్యం. ఓ పబ్లిక్ మీటింగ్ లో రోజా తన సహజ శైలి కామెంట్స్ తో మాట్లాడుతున్నారు. అప్పుడు పండుటాకు అయిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఏదో విషయాన్ని రోజా చెవిలో పడేశారు. ఆమె జగన్ వంక చూసేసరికి ఆయన సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో రోజాకు పూనకం వచ్చేసింది. తన నోటికి పని చెప్పంది. అంతవరకెందుకు తన తండ్రితో సమకాలికుడు చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి, కుమారుడు లోకేష్ ను టార్గెట్ చేస్తూ అప్పటి ఎమ్మెల్యే, ఇప్పటి మంత్రి జోగి రమేష్ చేసిన కామెంట్స్ అసెంబ్లీలో రికార్డయ్యాయి. చివరకు చంద్రబాబు కన్నీరుపెట్టినా వారు విడిచిపెట్టలేదు.ఈ తతంగం జరుగుతున్నంత సేపు జగన్ నవ్వుతూ తనలో ఉన్న వికృత చేష్టను చూపించారు. అంతకు ముందు విపక్షంలో ఉన్నప్పుడు రామోజీరావు కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూశారు. ఆయన కుమారుడు సుమన్ బలహీనతలను ఆసరాగా చేసుకొని సొంత మీడియా సాక్షిలో తప్పుడు కథనాలు ప్రచురించారు. అప్పటి సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడు ఆరోగ్యం విషయంలో కూడా తప్పుడు ప్రచారం చేశారు. చంద్రబాబు పట్టించుకోలేదని కథనాలు రాశారు. అయితే అవి తప్పుడువి కావడంతో తేలిపోయాయి. అయితే ఇప్పుడు అవే సిట్యువేషన్లు జగన్ కు ఎదురవుతున్నాయి. సొంత కుటుంబంలో చీలిక వచ్చింది. దీనిని ఎవరూ ఊహించి ఉండరు కూడా. అప్పటి నుంచి కౌంటర్ అటాక్ ప్రారంభమైంది. ఇప్పుడు పవన్ రూపంలో పవర్ ఫుల్ గా పురుడుబోసుకుంది. దాని ప్రభావం స్టాట్ అయ్యింది కూడా. జగన్ ఎంతలా ఇచ్చారు అవి తిరిగి ఆయన వద్దకే చేరడం ప్రారంభమైంది.