Manchu Vishnu- Jinnah Movie: మంచు విష్ణు లేటెస్ట్ మూవీ జిన్నా నేడు విడుదల అవుతుండగా అప్పుడే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారట. పెయిడ్ బ్యాచ్ మూవీని దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతున్నారని మంచు విష్ణు ఆధారాలతో సహా బయటపెట్టాడు. దీనికి పాల్పడిన యూట్యూబ్ ఛానల్స్ త్వరలో మూతపడతాయని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలియజేశారు. మంచు విష్ణు తన ట్వీట్లో… ఊహించిన విధంగానే పెయిడ్ బ్యాచ్ వచ్చేశారు. సినిమా విడుదల కాకుండానే నెగిటివ్ రివ్యూలు ప్రచారం చేస్తున్నారు. ఇంత వ్యతిరేకత ఎందుకు? ఈ ఛానల్స్ అన్నీ త్వరలో మూతపడతాయని వాళ్లకు అర్థం అవుతుందని భావిస్తున్నాను… అని కామెంట్ చేశారు.

అలాగే నెగిటివ్ రివ్యూలు రాసిన యూట్యూబ్ ఛానల్స్ లింక్స్ ఆయన ట్వీట్ లో పొందుపరిచాడు. ట్రోల్స్, నెగిటివ్ ప్రచారంపై సీరియస్ గా ఉన్న మంచు విష్ణు ఈసారి గట్టి చర్యలే తీసుకునేలా కనిపిస్తున్నారు. నెగిటివ్ రివ్యూలు రాసిన సదరు యూట్యూబ్ ఛానల్స్ మూల్యం చెల్లించే సూచనలు ఉన్నాయి. ఈ ట్రోల్స్ ఒక ప్రముఖ నటుడు వెనకుండి చేయిస్తున్నాడని మంచు విష్ణు గతంలో వెల్లడించారు. మీడియా ముఖంగా ఆ నటుడు ఎవరో కూడా తెలుసు అన్నారు.
విచారణలో ట్రోల్స్ పోస్ట్ చేస్తున్న వారి ఐపీ అడ్రెస్లు దొరికాయి. వాటి ఆధారంగా మంచు ఫ్యామిలీపై ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్ సదరు నటుడు ఆఫీస్ నుండి పోస్ట్ చేస్తున్నారని తెలిసిందని మంచు విష్ణు తెలియజేశారు. అయితే ఆ నటుడు ఎవరనేది మంచు విష్ణు బయటపెట్టలేదు. చాలా కాలంగా మంచు ఫ్యామిలీ మెంబర్స్ అయిన మంచు విష్ణు, మోహన్ బాబు, మంచు లక్ష్మీ విపరీతమైన సోషల్ మీడియా ట్రోలింగ్ కి గురవుతున్నారు.

మరోవైపు వరుస పరాజయాలు మంచు ఫ్యామిలీని అవమానాలకు గురి చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో విడుదలైన మోసగాళ్లు, సన్ ఆఫ్ ఇండియా చిత్రాలు డిజాస్టర్స్ అయ్యాయి. కనీసం ప్రేక్షకులు ఆ చిత్రాలను పట్టించుకోలేదు. సన్ ఆఫ్ ఇండియా ఫెయిల్యూర్ కి కారణం ట్రోల్స్ అంటూ మోహన్ బాబు ఫైర్ అయ్యారు. తన సినిమాను కావాలని దెబ్బతీశారంటూ ధ్వజమెత్తారు. ఇక మంచు విష్ణు తాజా చిత్రం జిన్నా పై కూడా నెగిటివ్ ప్రచారం ఊపందుకోగా ఆయన స్పందించారు. చర్యలకు సిద్ధమయ్యారు.