Rashmi Gautam- Nandu: గీతా మాధురి భర్త నందు చేసిన పనికి రష్మీ గౌతమ్ ఫైర్ అయ్యారు. అది ప్రాంక్ కాదు నేరుగా నాపై ఒత్తిడి తెచ్చారంటూ అసహనం వ్యక్తం చేశారు. రష్మీ గౌతమ్ తమ మూవీ ప్రమోషన్స్ కి రావడం లేదు. ఫోన్ చేస్తే ఎత్తడం లేదంటూ హీరో నందు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కాల్స్ కి రెస్పాండ్ కావడం లేదని నందుతో పాటు బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ దర్శకుడు నేరుగా రష్మీ షూటింగ్ చేస్తున్న స్టూడియోకి వెళ్లారు. మా ఫోన్ ఎత్తడం లేదు, ప్రమోషన్స్ కి రావడం లేదని నిలదీయడంతో.. ప్రమోషన్స్ తో నాకు సంబంధం లేదని రష్మీ కుండబద్దలు కొట్టింది. ఎప్పుడో ఆగిపోయిన మూవీ రెండేళ్ల తర్వాత విడుదలైతే ప్రమోషన్స్ కి రావాలా? అంటూ ఆమె ప్రశ్నించారు.

ఈ వ్యవహారం మొత్తం వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో వదిలారు. దీంతో ఇది ప్రమోషనల్ ట్రిక్. రష్మీతో ప్రాంక్ వీడియో చేశారని అందరూ భావించారు. అయితే తాజాగా నందుతో పాటు రష్మీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అక్కడ తన అసహనం బయటపెట్టారు. నందు చేసింది ప్రాంక్ వీడియో కాదు, నిజంగానే నా దగ్గరకు వచ్చేశారు అన్నారు. బొమ్మ బ్లాక్ బస్టర్ రెండేళ్ల క్రితం విడుదల కావాల్సింది. ఆ సినిమా రిలీజ్ కావడం ఆల్మోస్ట్ కష్టమే అని నేను భావించాను.
సడన్ గా ఒకరోజు ఫోన్ చేసి మన మూవీ విడుదలవుతుంది, ప్రమోషన్స్ చేయాలి అన్నారు. ముందుగా ఒప్పుకున్న షెడ్యూల్స్ ఉన్నాయి, వాటిని బట్టి ప్రమోషన్స్ చేస్తానని చెప్పాను. అయినప్పటికీ ఇలా ఒత్తిడి పెంచేశారు. నేను బాత్ రూమ్ లో ఉన్నా కూడా ప్రమోషన్స్ అంటూ కెమెరాలు పెట్టేస్తారా.. అని రష్మీ ఒకింత ఫైర్ చేశారు. మన రష్మీనే కదా మాట వింటుందని అలా చేశాము. మరొక హీరోయిన్ అయితే చెప్పుతో కొట్టేదని నందు అన్నాడు.

నందు-రష్మీ గౌతమ్ జంటగా నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ నవంబర్ 4న విడుదల కానుంది. ఈ మూవీలో రష్మీ పల్లెటూరి అమ్మాయి పాత్ర చేశారు. ఎప్పుడూ గ్లామర్ రోల్స్ చేస్తున్న రష్మీ ఈ మూవీలో కొంచెం భిన్నమైన రోల్ ట్రై చేశారు. ఆమె నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర చేసినట్లు సమాచారం. బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్రానికి రాజ్ విరాట్ దర్శకుడు. రఘు కుంచె, కిరీటి ఇతర కీలక రోల్స్ చేస్తున్నారు.