https://oktelugu.com/

నారాలోకేష్ కు ఏపీ పోలీసుల హెచ్చరికలు

ఏపీలో నారాలోకేష్ వర్సెస్ గుంటూరు జిల్లా పోలీసుల మధ్య ఫైట్ నడుస్తోంది. లోకేష్ ట్వీట్ చేయడం.. దానికి గుంటూరు జిల్లా పోలీసులు హెచ్చరికలు జారీ చేయడంతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. నారా లోకేష్ బుధవారం ఓ ట్వీట్ చేశారు. ఓ ప్రహరీ గోడ ప్రారంభోత్సవానికి వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యేపై టీడీపీ కార్యకర్త మణిరత్నం పోస్ట్ పెడితే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఆ వీడియోలను ట్వీట్ చేశారు. టీడీపీ కార్యకర్తకు అండగా ఉంటామన్నారు. వైసీపీ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 26, 2020 / 09:30 PM IST
    Follow us on

    ఏపీలో నారాలోకేష్ వర్సెస్ గుంటూరు జిల్లా పోలీసుల మధ్య ఫైట్ నడుస్తోంది. లోకేష్ ట్వీట్ చేయడం.. దానికి గుంటూరు జిల్లా పోలీసులు హెచ్చరికలు జారీ చేయడంతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. నారా లోకేష్ బుధవారం ఓ ట్వీట్ చేశారు. ఓ ప్రహరీ గోడ ప్రారంభోత్సవానికి వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యేపై టీడీపీ కార్యకర్త మణిరత్నం పోస్ట్ పెడితే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఆ వీడియోలను ట్వీట్ చేశారు. టీడీపీ కార్యకర్తకు అండగా ఉంటామన్నారు. వైసీపీ నేతలు ఆడమన్నట్టు పోలీసులు ఆడుతూ అక్రమ అరెస్ట్ లు చేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. దీంతో పోలీసులపై లోకేష్ వ్యాఖ్యలకు గుంటూరు ఎస్పీ కౌంటర్ ఇచ్చాడు. హెచ్చరికలు జారీ చేశాడు.

    Also Read: న్యాయవ్యవస్థపై తమ్మినేని సంచలన కామెంట్స్..!

    గుంటూరు పోలీసులు చేసిన ట్వీట్‌కు నారా లోకేష్ కూడా కౌంటర్ ఇచ్చారు. గుంటూరు అర్బన్ ఎస్పీకి ధైర్యం ఉంటే పెదకాకాని పోలీస్ స్టేషన్ లో సీసీ టీవీ ఫుటేజ్ బయటపెట్టాలని లోకేష్ డిమాండ్ చేశారు. టీడీపీ కార్యకర్త మణిరత్నం ఆ పోలీస్ స్టేషన్ వద్ద విడుదలైన ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. పోలీసులు రాజకీయ ఉన్నతాధికారులకు లొంగిపోవడం మానుకోవాలన్నారు. లోకేష్ ట్వీట్‌పై గుంటూరు జిల్లా పోలీసులు స్పందించాల్సి ఉంది.

    హెచ్చరికలు జారీ చేస్తూ ఎమ్మెల్సీ నారా లోకేష్ కు గుంటూరు జిల్లా పోలీసులు షాక్ ఇచ్చారు. ఆయన చేసిన ట్వీట్లపై అభ్యంతరం తెలుపుతూ హెచ్చరికలు జారీ చేశారు. తప్పుడు ప్రచారం చేయవద్దని.. న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

    Also Read: ఫైట్ కు రె‘ఢీ’ అవుతున్న జగన్, చంద్రబాబు

    లోకేష్ ట్వీట్టర్ ద్వారా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కులపరంగా లోకేష్ రెచ్చగొట్టే విధంగా చూశారని మండిపడ్డారు.దీతో ఇప్పుడు ఏపీలో మళ్లీ పోలీసులు, టీడీపీ ఫైట్ రాజుకుంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్