https://oktelugu.com/

బిగ్ బాస్ ట్వీస్ట్.. ఈవారంలో రీఎంట్రీ… ఎలిమినేషన్ లేవా? 

కరోనా టైంలోనూ ‘బిగ్ బాస్’ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. తెలుగు రియల్టీ షోలలో నెంబర్ వన్ గా కొనసాగుతున్న బిగ్ బాస్ తన స్థానాన్ని బిగ్ బాస్-4తో మరింత పదిలం చేసుకుంది. గత మూడు సీజన్లకు భిన్నంగా బిగ్ బాస్ నాలుగో సీజన్ కొనసాగుతూ బుల్లితెర అభిమానులను అలరిస్తోంది. Also Read: సుశాంత్ సింగ్ మృతి కేసులో కీలక ట్విస్ట్ ప్రస్తుతం బిగ్ బాస్-4 సీజన్ ముగింపు దశకు చేరుకోవడంతో గేమ్ రసవత్తరంగా మారుతోంది. దీంతో […]

Written By:
  • NARESH
  • , Updated On : November 26, 2020 / 09:20 PM IST
    Follow us on

    కరోనా టైంలోనూ ‘బిగ్ బాస్’ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. తెలుగు రియల్టీ షోలలో నెంబర్ వన్ గా కొనసాగుతున్న బిగ్ బాస్ తన స్థానాన్ని బిగ్ బాస్-4తో మరింత పదిలం చేసుకుంది. గత మూడు సీజన్లకు భిన్నంగా బిగ్ బాస్ నాలుగో సీజన్ కొనసాగుతూ బుల్లితెర అభిమానులను అలరిస్తోంది.

    Also Read: సుశాంత్ సింగ్ మృతి కేసులో కీలక ట్విస్ట్

    ప్రస్తుతం బిగ్ బాస్-4 సీజన్ ముగింపు దశకు చేరుకోవడంతో గేమ్ రసవత్తరంగా మారుతోంది. దీంతో ప్రేక్షకులు బిగ్ బాస్ ను చూసేందుకు మరింత ఆసక్తిని చూపుతున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్-4లో దెత్తడి హరిక.. మొనాల్ గజ్జర్.. అరియానా.. అభిజిత్.. అఖిల్.. సోహెల్.. అవినాష్ మాత్రమే మిగిలి ఉన్నారు. వీరి మధ్యే పోటీ తీవ్రంగా ఉంది.

    ఈ ఏడుగురిలో బిగ్ బాస్ విన్నర్ ఎవరా? అనేది ఆసక్తి మొదలైంది. 12వ వారంలో బిగ్ బాస్ కంటెస్టెంట్లకు షాకుల మీదు షాకులు ఇస్తున్నాడు. వచ్చేవారానికి ఇమ్యూనిటీని అవినాష్ గెలుచుకోవడంతో గేమ్ మరింత రసవత్తరంగా మారింది. ఈవారం బిగ్ బాస్ ఎలిమినేషన్ నుంచి అవినాష్ ఎస్కేప్ అయితే అతడికి మరో మూడు వారాలదాకా ఢోకా ఉంది. దీంతో అతడు టాప్-5లో ఉండటం ఖాయంగా కన్పిస్తోంది.

    బిగ్ బాస్-4 సీజన్ ఈ వారంతో కలుపుకుంటే సీజన్ ముగియడానికి ఇంకో మూడువారాల సమయం ఉంది. చివరి వారంలో బిగ్ బాస్ లో ఐదుగురు కంటెస్టెంట్స్ ఉండాలి. అంటే ఇప్పుడు ఎనిమిది మంది కంటెస్టెంట్స్ హౌస్‍లో వుండాలి. కానీ ప్రస్తుతం ఏడుగురే ఉన్నారు. దీంతో ఎలిమినేటైన వారిలో నుంచి ఒకరిని రీ ఎంట్రీ ద్వారా లోపలికి పంపుతారనే ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుత టైంలో బయటి నుంచి వేరే వ్యక్తిని హౌస్ లోకి పంపడం రిస్క్ అని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నారు.

    Also Read: ట్రెండ్ ను ఫాలో అవుతున్న నాగ్.. సంచలన నిర్ణయం తీసుకున్నాడా?

    దీంతో ఈ ఐడియాను బిగ్ బాస్ టీం వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ వారం ఎలిమినేషన్‍ లేకుండా కంటెస్టెంట్స్ కు ఒక వారం ఎక్స్టెన్షన్‍ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఈవారం నామినేటైన అవినాష్‍ ఎలిమినేట్‍ అవుతాడనే ప్రచారం జరిగినా అతడికి ఎవిక్షన్‍ ఫ్రీ పాస్‍ ఇచ్చారట. దీంతో అనినాష్ ఈ వారం సేఫ్ అయినట్లేనని తెలుస్తోంది. ఇక వచ్చే రెండు వారాల్లో ఇద్దరిని బయటికి పంపనున్నారు.

    ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్లలో ఇద్దరు బయటికి వెళితే అభిజిత్.. సొహైల్ ఫైనల్ బెర్తులు ఖాయమనే టాక్ విన్పిస్తోంది. మిగిలిన ఐదుగురిలో ఇద్దరు టాప్-5లో చోటు దక్కించుకోనున్నారు. వీరిలో అవినాష్‍.. అఖిల్‍లో ఒకరు ఉండే అవకాశం ఉండగా అరియానా.. హారిక.. మోనల్‍లలో ఒకరు బయటికి వెళ్లే అవకాశం ఉంది. అనివాష్ కు బిగ్ బాస్ నుంచి ప్రతీసారి సహకారం లభిస్తుండటంతో అఖిల్ ఫైనల్ లిస్టులో ఉంటాడా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్