AP New Schemes: ఏపీలో కొత్త పథకాలు.. ఈ నెల నుంచే అమలు.. అర్హుల ఖాతాల్లో రూ.10 వేలు

AP New Schemes: ఏపీ సర్కారు మొదటి నుంచి సంక్షేమ పథకాలపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతోంది. ఫిబ్రవరి నెలలో సైతం కొన్ని కొత్త పతకాలను అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే వివిధ పథకాల్లో భాగంగా అర్హులకు సాయం అందిస్తోంది. వాటిని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తోంది. ఈ సంవత్సరంలో ఫస్ట్ వైఎస్సార్ ఈబీసీ నేస్తం పేరుతో ఓ పథకాన్ని తీసుకొచ్చింది. అగ్రవర్ణాల్లోని పేద మహిళల ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమచేసింది ఏపీ సర్కారు. ఇక ఫిబ్రవరిలోనూ […]

Written By: Mallesh, Updated On : February 3, 2022 12:38 pm
Follow us on

AP New Schemes: ఏపీ సర్కారు మొదటి నుంచి సంక్షేమ పథకాలపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతోంది. ఫిబ్రవరి నెలలో సైతం కొన్ని కొత్త పతకాలను అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే వివిధ పథకాల్లో భాగంగా అర్హులకు సాయం అందిస్తోంది. వాటిని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తోంది. ఈ సంవత్సరంలో ఫస్ట్ వైఎస్సార్ ఈబీసీ నేస్తం పేరుతో ఓ పథకాన్ని తీసుకొచ్చింది. అగ్రవర్ణాల్లోని పేద మహిళల ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమచేసింది ఏపీ సర్కారు. ఇక ఫిబ్రవరిలోనూ కొత్తగా పలు పథకాలను అమలు చేసేందుకు రెడీ అయింది. రజకులు, టైలర్లు, నాయీ బ్రహ్మణులకు లబ్ధి చేకూర్చేందుకు జగనన్న చేదోడు అనే పథకాన్ని అమలు చేయనుంది ప్రభుత్వం. ఈ పథకం కింద అర్హలకు రూ.10 వేల చొప్పున వారి ఖాతాల్లో జమ చేయబోతోంది. ఈ పథకాన్ని ఫిబ్రవరి 8వ తేదీన సీఎం జగన్ ప్రారంభించనున్నారు. కులవృత్తులకు సంబంధించి షాపులు నిర్వహిస్తున్న వారిలో అర్హలకు ఈ పథకం వర్తిస్తుంది. ఇందుకోసం వలంటీర్ల ద్వారా నేరుగా గ్రామ సచివాలయాల్లో అర్హులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

AP New Schemes

Also Read: జగన్ ఎవరికి ఛాన్స్ ఇస్తారు? మరి ఆశావహుల పరిస్థితి ఏంటి?
రైతుల కోసం ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రవేశపెట్టనుంది. వారికి అండగా ఉండేందుకు వైఎస్‌ఆర్ ఇన్ పుట్ సబ్సిడీ మొత్తాన్ని కూడా రైతులకు చెల్లించేందుకు రెడీ అయింది సర్కారు. ఏపీలో తాజాగా వరదల్లో పంట నష్టపోయిన వాటిల్లింది. దీంతో ఒక సీజన్ లో జరిగిన నష్టాన్ని అదే సీజన్ లోగా ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించుకున్న ప్రభుత్వం.. ఇన్ పుట్ సబ్సిడీని రైతుల ఖాతాల్లో జమచేయనుంది. ఇందుకు సంబంధించిన డబ్బులను ఈ నెల 15వ తేదీన ఆన్ లైన్ ద్వారా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇరు చిరు వ్యాపారులకు వడ్డీ లేకుండా రుణాలిచ్చే కార్యక్రమాన్ని ఈ నెల 22వ తేదీన ప్రభుత్వం ప్రారంభించనున్నది. ఈ పథకం ద్వారా మొత్తంగా 16 లక్షల మంది లబ్ధిదారులకు సాయం అందనుంది. బడ్డీకొట్లు, తోపుడు బండ్ల నిర్వహణ ద్వారా ఉపాధి పొందుతున్న వారికి అండగా ఉండేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుంది. డ్వాక్రా సంఘాల వారు, చిరు వ్యాపారులు.. వాలంటీర్ల ద్వారా సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం వాటిని పరిశీలించి.. అర్హులను ఎంపిక చేస్తారు.

AP New Schemes

Also Read: తెలంగాణలో పని మొదలుపెట్టిన పీకే టీం?

Tags