OKtelugu MovieTime: టాలీవుడ్ ప్రజెంట్ క్రేజీ మూవీ డేట్స్

OKtelugu MovieTime: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. అఖిల భారత మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రవణం స్వామినాడుయు అంటే అందరికి తెలుసు. మరో మినీ మెగాస్టార్ అంటూ ఫ్యాన్స్ ఆయనను పిలుస్తూ ఉంటారు. కాగా తాజాగా ఆయన మెగా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. అతను కరోనా బారిన పడినప్పుడు అతని పై అభిమానుల నుంచి వెల్లువెత్తిన అభిమానానికి లేదసలు కొలమానమంటూ స్వామినాయుడు ధన్యవాదాలు తెలిపారు. ఇంత మంది […]

Written By: Raghava Rao Gara, Updated On : February 3, 2022 12:48 pm
Follow us on

OKtelugu MovieTime: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. అఖిల భారత మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రవణం స్వామినాడుయు అంటే అందరికి తెలుసు. మరో మినీ మెగాస్టార్ అంటూ ఫ్యాన్స్ ఆయనను పిలుస్తూ ఉంటారు. కాగా తాజాగా ఆయన మెగా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. అతను కరోనా బారిన పడినప్పుడు అతని పై అభిమానుల నుంచి వెల్లువెత్తిన అభిమానానికి లేదసలు కొలమానమంటూ స్వామినాయుడు ధన్యవాదాలు తెలిపారు. ఇంత మంది అభిమానం మెగాస్టార్ చిరంజీవి ద్వారా చూరగొనడంతో నాజన్మ ధన్యమైందని అన్నారు.

Ravanam Swamy Naidu

 

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. ‘మేజర్’ మూవీ రిలీజ్ డేట్‌పై హీరో అడివి శేష్ అప్‌డేట్ ఇచ్చాడు. ‘మంచి తేదీకి సినిమాను విడుదల చేస్తాం. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటాం. ఇది కేవలం సినిమా కాదు. నిజం. ఇది మేజర్ ప్రామిస్’ అని ట్వీట్ చేశాడు. ఆర్మీ అధికారి మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి శశికిరణ్ దర్శకత్వం వహించాడు.

Also Read:  వాడొక హీరో.. ‘పుష్ప’పై ఘాటుగా స్పందించిన గరికపాటి..!

 

Major

అలాగే మరో అప్ డేట్ ఏమిటంటే.. బైక్‌ రేసింగ్‌ నేపథ్యంలో తమిళ స్టార్‌ హీరో అజిత్‌ నటిస్తున్న వలిమై చిత్రం విడుదల తేదీని ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 24న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదలకు ఈ సినిమా సిద్ధం అవుతుంది. అయితే, రిలీజ్ పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది అని మేకర్స్‌ తాజాగా ప్రకటించారు.

Valimai

ఇక తెలుగు యువ హీరో కార్తికేయ్‌ ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 25న రిలీజ్ కావాలని అజిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు.

Also Read:  మోసపోవడం ఉద్యోగులకు అలవాటైందా?

Tags