https://oktelugu.com/

మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో..! : క్లారిటీ ఇచ్చిన నిహారిక

మెగా కుటుంబంలో ఇప్పటికే చాలా మంది హీరోలున్నారు. ఒకరిద్దరు కాదు ఓ క్రికెట్ టీం రెడీ అయిపోయిందని సెటైర్లు కూడా పడుతున్నాయి. సోషల్ మీడియాలో మెగా కుటుంబం గురించి ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది. ఒకే ఫ్యామిలీ నుంచి ఇంతమంది హీరోలు వస్తారా అంటూ కామెంట్ కూడా చేస్తున్నారు. చిరంజీవి నుంచి మొదలైన ఈ ప్రస్థానం పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ సహా చాలా మంది స్టార్స్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 15, 2021 / 01:46 PM IST
    Follow us on


    మెగా కుటుంబంలో ఇప్పటికే చాలా మంది హీరోలున్నారు. ఒకరిద్దరు కాదు ఓ క్రికెట్ టీం రెడీ అయిపోయిందని సెటైర్లు కూడా పడుతున్నాయి. సోషల్ మీడియాలో మెగా కుటుంబం గురించి ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది. ఒకే ఫ్యామిలీ నుంచి ఇంతమంది హీరోలు వస్తారా అంటూ కామెంట్ కూడా చేస్తున్నారు. చిరంజీవి నుంచి మొదలైన ఈ ప్రస్థానం పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ సహా చాలా మంది స్టార్స్ అయ్యారు.

    Also Read: జ‌గ‌ప‌తిబాబు తొలిరోజు షూటింగ్ లో.. చిరంజీవి ఏమ‌న్నారంటే..?

    శిరీష్, కళ్యాణ్ దేవ్ లాంటి వాళ్లు మాత్రమే ఇప్పటికీ తమ గుర్తింపు కోసం ట్రై చేస్తూనే ఉన్నారు. వాళ్లు కూడా అవకాశాలు దక్కించుకుంటూనే ఉన్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో హీరో కూడా మెగా కుటుంబం నుంచి వస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు ఉన్న వాళ్లు చాలరేమో అన్నట్లు మరో హీరో వస్తున్నాడంటూ సోషల్ మీడియాలో అప్పుడే సెటైర్లు కూడా పేలుతున్నాయి.

    చిరంజీవి కుటుంబం ఓ హీరోల ఫ్యాక్టరీ అనే చెప్పాలి. ఇటీవ‌లే వైష్ణవ్ తేజ్ కూడా వ‌చ్చాడు. త‌న‌కీ మంచి మార్కులు ప‌డ్డాయి. ఇప్పుడు ఈ కుటుంబం నుంచి మ‌రో హీరో వ‌స్తున్నాడ‌ని వార్తలు వినిపిస్తున్నాయి. త‌నెవ‌రో కాదు. మెగా అల్లుడు.. చైత‌న్య జొన్నలగడ్డ. ఇటీవ‌ల చైతన్యతో నిహారిక పెళ్లయిన సంగ‌తి తెలిసిందే. చైత‌న్యకు న‌ట‌న అంటే ఇష్టం ఉంద‌ని, త‌ను కూడా హీరో అయిపోతాడ‌ని వార్తలు వినిపించాయి. పైగా.. చిరు త‌న అల్లుడు క‌ల్యాణ్ దేవ్‌ని హీరోగా చేశాడు. అలా.. నాగ‌బాబు అల్లుడు కూడా హీరో అయిపోతాడ‌ని టాక్ వినిపిస్తోంది.

    Also Read: నాకు పెళ్లంటేనే ఇష్టం లేదు.. లాక్ డౌన్ లో ఏదో జ‌రిగిందిః సింగ‌ర్ సునీత

    ఈ విష‌యంపై నిహారిక కూడా క్లారిటీ ఇచ్చేసింది. ‘ఆయ‌న‌కు సినిమాలంటే చాలా ఇష్టం. కొత్త సినిమాలన్నీ చూస్తారు. కానీ.. న‌ట‌న‌పై ఎలాంటి ఆస‌క్తి లేదు..’ అని తేల్చేసింది. పైగా.. న‌ట‌న అన్నది ఓ ప్యాష‌న్ అని, చిన్నప్పటి నుంచీ దానిపై ఆసక్తి ఉండాల‌ని, ఇప్పటికిప్పుడు అది రాద‌ని అందుకే చైత‌న్య సినిమాల్లోకి రాడ‌ని చెప్పింది. ‘హీరో అంటే మాట‌లు కాదు. చాలా క‌ష్టప‌డాలి. త‌న నేప‌థ్యం వేరు. సినిమాలు చూస్తుంటారంతే. న‌టించరు. ఆ ఉద్దేశం మాకెవ‌రికీ లేదు’ అని కొట్టిపారేసింది నిహారిక‌. సో.. మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నాడనేది ఇప్పటివరకైతే రూమరే.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్