Movie Ticket Prices: ఏపీలో సినిమా టికెట్ ధరల విషయంలో గత కొన్ని రోజులుగా వాడి వేడి చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కొన్ని రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు జగన్ ప్రభుత్వంతో చర్చలు జరిపి ఆ నిర్ణయంపై పునరాలోచన చెయ్యాలని విజ్ఞప్తి చేస్తున్న విషయం తెలిసిందే.. టికెట్ రేట్ ల విషయంలో జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకు వెనక్కి తగ్గలేదు.
తాజాగా ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఏపీలో టికెట్ ధరలు తగ్గిస్తూ జగన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జీవో నెం. 35 ను ఉన్నత న్యాయస్థానం అయినా హాయ్ కోర్టు రద్దు చేసింది. దీంతో ఏపీ ప్రభుత్వానికి పెద్ద షాక్ తగిలిందనే చెప్పాలి. హైకోర్టు టికెట్ ధరల తగ్గింపు విషయంలో పాత విధానంలోనే టికెట్ల రేట్లు నిర్ణయించేందుకు పిటిషినర్లకు వెసులు బాటు కల్పించింది.
ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలను తగ్గిస్తూ జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ థియేటర్ యాజమాన్యాలు హై కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. థియేటర్ యాజమాన్యాలు వేసిన పిటిషన్ పై ఈ రోజు హైకోర్టు లో వాదనలు జరిగాయి. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా జగన్ ప్రభుత్వం జీవో ను ఇచ్చిందని థియేటర్ యాజమాన్యాలు పిటిషన్ లో పేర్కొంది.
Also Read: AP Three Capitals: మూడు రాజధానులే కావాలంటూ ఫ్లెక్సీల కలకలం?
ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైంది కాదని కొత్త సినిమాలు విడుదల అయినా సమయంలో టికెట్ రేట్స్ ను పెంచుకునే అధికారం థియేటర్ యాజమాన్యాలకు ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇక ఈ పిటిషన్ పై ఈ రోజు మంగళవారం పిటిషినర్ తరపున సీనియర్ న్యాయవాదులు ఆదినారాయణ, దుర్గ ప్రసాద్ తమ వాదనలు కోర్టుకు వినిపించారు. టికెట్ ధరకు తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదని కోర్టుకు విన్నవించారు. వీరి వాదనలతో హైకోర్టు ఏకీభవించి ఎపి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం 35 ను సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసారు. దీంతో ఏపీ ప్రభుత్వానికి కోర్టులో చుక్కెదురు అయ్యింది.
Also Read: Peddireddy Ramachandra Reddy: తల్లి కోరిక తీర్చిన మంత్రి.. ఎల్లమ్మ ఆలయం రెండు నెలల్లో నిర్మాణం