Essential Commodities: దేశంలో ధరలు పెరిగిపోతున్నాయి. పెరిగిన ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర సరుకుల నుంచి అన్నింటి ధరలు కూడా అమాంతం పెరుగుతున్నాయి. దీంతో అన్నింటిపైనా ప్రభావం పడుతోంది. ద్రవ్యోల్బణం కూడా రోజురోజుకు గరిష్టంగా మారుతోంది. రోజురోజుకు ధరల పెరుగుదల ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వాలు మాత్రం ధరల తగ్గుదలకు ఎలాంటి ప్రణాళికలు రూపొందించడం లేదని తెలుస్తోంది.

గత మూడు నెలలుగా ధరల్లో మార్పులు గణనీయంగా చోటుచేసుకుంటున్నాయి. పెట్రో ధరల పెరుగుదల అన్నింటిని పెరిగేలా చేశాయి. దీంతో ప్రజలకు అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్న చందంగా సగటు సామాన్యుడు ఏం కొనేందుకు కూడా సిద్ధ పడటం లేదు. ద్రవ్యోల్బణం భారీగా పెరగడంతో ఆర్థిక వ్యవస్థపైనా పెను భారమే పడుతోంది.
నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. పప్పులు, నూనెలు, కూరగాయలు, పండ్లు అన్నింటి ధరలు అమాంతం పెరుుతున్నాయి. దీంతో సామాన్యుడి జేబు గుల్ల అవుతోంది. నెలవారి సంపాదన దేనికీ సరిపోవడం లేదు. ఫలితంగా బతుకు ఎలా అనే ప్రశ్నలు వస్తున్నాయి. దినసరి ఖర్చులు పెరగడంతో బడ్జెట్ అంచనాలను మించిపోతోందని తెలుస్తోంది.
Also Read: Mumbai bar raided: అద్దం మాటున అసలు బాగోతం.. బార్ పై దాడిలో పోలీసులకు తెలిసిన ట్విస్ట్ ఏంటంటే?
ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ పై ధరలు తగ్గించినా రాష్ర్ట ప్రభుత్వాలు మాత్రం తగ్గించలేదు. దీంతో ప్రజలపైనే భారం పడుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ప్రజలపై భారం మోపకుండా ధరల నియంత్రణపై శ్రద్ధ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Also Read: BJP: బీజేపీ చార్ ధమాకా.. నాలుగు రాష్ట్రాల్లో కమలం.. ఒక స్టేట్‌లో ఆప్..?