YS Vivekananda Reddy: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక మలుపులు తిరుగుతున్నాయి. సీబీఐ కేసును దర్యాప్తు చేస్తున్నా అందులో వేగవంతం కనిపించడం లేదు. దీంతో వివేకా కుమార్తె, అల్లుడి పాత్రలపై అనుమానాలు వస్తున్నాయి. వారిపై వరుసగా ఫిర్యాదులు వస్తున్నాయి. అయినా కేసు మాత్రం ఓ కొలిక్కి రావడం లేదు. ఈ నేపథ్యంలో వివేకానందరెడ్డి వద్ద పీఏగా పనిచేసిన కృష్ణారెడ్డి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేయడం గమనార్హం.
వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, శివ ప్రకాశ్ రెడ్డిల నుంచి ప్రాణహాని ఉందని కృష్ణారెడ్డి ఫిర్యాదు చేయడంతో అన్ని కోణాల్లో దర్యాప్తు సాగుతోంది. ఈ మేరకు ఎస్పీ అమృరాజన్ మాత్రం దీనికి సంబంధించిన విషయాలు వెల్లడిస్తున్నారు. కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. దేవిరెడ్డి శంకర్ రెడ్డి, భరత్ యాదవ్, గంగాధర్ రెడ్డి లాంటి వారు సునీత దంపతులపై ఆరోపణలు చేయడం తెలిసిందే.
ఈ జాబితాలో చాలా మంది ఉంటున్నా సీబీఐ మాత్రం కేసును ఛేదించడం లేదు. ఫలితంగా సొంత వారే వివేకాను హత్య చేశారని చెబుతున్నా సీబీఐ మాత్రం కేసులో ఎలాంటి పురోగతి చూపించడం లేదు. ఫలితంగా కేసు సంవత్సరాలుగా పెండింగులోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో వివేకా హత్య కేసుపై ఎప్పుడు వేగం పెంచుతారో తెలియడం లేదు.
Also Read: AP Three Capitals: మూడు రాజధానులే కావాలంటూ ఫ్లెక్సీల కలకలం?
దీంతో సునీత, ఆమె భర్త ల పాత్రలపై అనుమానాలు వ్యక్తమవుతున్నా వారిపై ఎలాంటి కేసు నమోదు చేయడం లేదు. ఒకరి కాదు ఇద్దరు కాదు అందరు కూడా వారి పాత్రలపైనే ఫిర్యాదు చేస్తున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే అపవాదు వస్తోంది. దీంతో ఎప్పటికి వివేకా కేసు కొలిక్కి వచ్చేనో తెలియడం లేదు.
Also Read: Peddireddy Ramachandra Reddy: తల్లి కోరిక తీర్చిన మంత్రి.. ఎల్లమ్మ ఆలయం రెండు నెలల్లో నిర్మాణం