సీఎం జగన్, వైసీపీ మంత్రులకు హైకోర్టు నోటీసులు.. ఎందుకంటే?

ఏపీ మూడు రాజధానుల వ్యవహారంలో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. హైకోర్టు రాజధాని తరలింపుపై స్టేటస్ కో (యథాతథ స్థితి)ని వచ్చే నెల 21వ తేదీ వరకు పొడిగించింది. రాజధాని ప్రాంతాలలో నిర్మాణాల విషయంలో స్టేటస్ కో వర్తిస్తుందని కోర్టు పేర్కొంది. పిటిషన్లలో ప్రతివాదులుగా ఉన్న సీఎం జగన్, మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, వైసీపీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మరియు టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం పార్టీల అధ్యక్షులకు […]

Written By: Navya, Updated On : August 29, 2020 1:20 pm
Follow us on

ఏపీ మూడు రాజధానుల వ్యవహారంలో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. హైకోర్టు రాజధాని తరలింపుపై స్టేటస్ కో (యథాతథ స్థితి)ని వచ్చే నెల 21వ తేదీ వరకు పొడిగించింది. రాజధాని ప్రాంతాలలో నిర్మాణాల విషయంలో స్టేటస్ కో వర్తిస్తుందని కోర్టు పేర్కొంది. పిటిషన్లలో ప్రతివాదులుగా ఉన్న సీఎం జగన్, మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, వైసీపీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మరియు టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం పార్టీల అధ్యక్షులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Also Read : పవన్ కళ్యాణ్ సైలెన్స్ వెనుక ఇంత వైలెంటా?

నోటీసులు అందుకున్న వారు పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని భావిస్తే 21 రోజుల్లో వేయాలని తెలిపింది. స్టేటస్ కో ఉత్తర్వులు అమలులో ఉన్న సమయంలో విశాఖలోని గ్రేహౌండ్స్ కొండపై అతిథిగృహ నిర్మాణం చేపట్టడంపై హైకోర్టు సీరియస్ అయింది. అతిథి గృహ నిర్మాణం గురించి చీఫ్ సెక్రటరీ వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అతిథి గృహం నిర్మాణానికి స్టేటస్ కో అమలులో ఉన్న సమయంలో ఎందుకు చర్యలు చేపట్టారో రెండు వారాల్లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వం, సీఆర్డీఏను కోర్టు ఆదేశించింది.

ప్రభుత్వం కౌంటర్లు దాఖలు చేసిన తరువాత పిటిషనర్లు వారం రోజుల్లో వాటికి సమాధానం ఇవ్వాలని కోర్టు పేర్కొంది. అనంతరం విచారణను సెప్టెంబర్ 21 వరకు వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. పిటిషన్ల విచారణను భౌతికంగా నిర్వహించాలా లేక వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించాలా….? అనే విషయాన్ని విచారణకు వారం రోజుల ముందు నిర్ణయిస్తామని పేర్కొంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ జేవీ శేషసాయి, జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం నిన్న ఈ ఆదేశాలు జారీ చేసింది.

Also Read : జగన్ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఇది ! ఇంకో మాట లేదు