రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల విషయం ఇటీవల చర్చనీయాంశంగా మారింది. సలహాదారులకు సలహాలు ఇచ్చే పని మాత్రం ఎక్కడ అస్సలు ఉండదనే విషయం స్పష్టమయింది. ఈ విషయంలొనే సలహాదారుడు రామచంద్రమూర్తి విధులకు దూరంగా ఉంటూ జీతం తీసుకోవడం లేదు. ఏ వివాదం ఎలా ఉండగా పోలవరం ప్రాజెక్టు సాంకేతిక, న్యాయ సలహాదారు హెచ్‌కే సాహును విధుల నుంచి తప్పిస్తూ నిర్ణయం కీలక నిర్ణయం తీసుకుంది.
జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌లోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయంలో ప్రాజెక్టు సాంకేతిక, న్యాయ సలహాదారుగా సాహుని 2018, ఏప్రిల్ 14వ తేదీన కన్సల్టెంట్‌గా ఏపీ ప్రభుత్వం నియమించింది. అయితే ఆయన పనితీరు సంతృప్తికరంగా లేదని ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు సీఈ నివేదిక పంపారు. ఈ నివేదిక ఆధారంగా ప్రత్యేక కార్యదర్శి సాహును తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కన్సల్టెంట్‌గా సాహును తొలగించే బలమైన కారణం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. కేవలం సిఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ప్రభుత్వం నిర్ణయం తిసుకున్నాకే సిఈతో నివేదిక సిద్ధం చేయించినట్లు సమాచారం.