https://oktelugu.com/

నాగాలాండ్ కు తిరిగి రాకపోతే రూ 10 వేల బహుమతి!

  లాక్ డౌన్ అమలులోకి వచ్చిన సుమారు 50 రోజుల వరకు వలస కార్మికుల గురించి పట్టించుకోకుండా ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకేసారి వారి విషయంలో స్పందిస్తున్నాయి. సొంత ప్రాంతాలకు వెళ్ళాలి అనుకున్న వారికి ప్రత్యేక రైళ్లు, బస్సులు ఏర్పాటు చేసి పంపిస్తున్నారు. ఇప్పడికే లక్షల మంది ఆ విధంగా వెళ్లారు. అదే సమయంలో కొన్ని ఆర్ధిక కార్యకలాపాలు ప్రారంభం కావడంతో వీళ్లంతా వెళ్ళిపోతే పనులు ఎట్లాగూ సాగుతాయి అంటూ పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 15, 2020 / 02:40 PM IST
    Follow us on

     

    లాక్ డౌన్ అమలులోకి వచ్చిన సుమారు 50 రోజుల వరకు వలస కార్మికుల గురించి పట్టించుకోకుండా ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకేసారి వారి విషయంలో స్పందిస్తున్నాయి. సొంత ప్రాంతాలకు వెళ్ళాలి అనుకున్న వారికి ప్రత్యేక రైళ్లు, బస్సులు ఏర్పాటు చేసి పంపిస్తున్నారు. ఇప్పడికే లక్షల మంది ఆ విధంగా వెళ్లారు.

    అదే సమయంలో కొన్ని ఆర్ధిక కార్యకలాపాలు ప్రారంభం కావడంతో వీళ్లంతా వెళ్ళిపోతే పనులు ఎట్లాగూ సాగుతాయి అంటూ పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తూ, వెళ్లకుండా ఉండేందుకు పలు ప్రోత్సాహకాలను ప్రకటిస్తున్నాయి. ఒకొక్కరికి రూ 5,000 నగదుతో పాటు పలు సదుపాయాలను ప్రకటిస్తున్నారు.

    అదే సమయంలో వారంతా తిరిగి వస్తే వారితో పాటు కరోనా వైరస్ కూడా వస్తుందని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భయపడుతున్నాయి. వారిలో కొందరు కరోనా పాజిటివ్ గా తేలడం కూడా తెలిసిందే. అందుకనే నాగాలాండ్ ప్రభుత్వం సొంత రాష్త్రానికి తిరిగి రాకపోతే ఒకొక్కరికి రూ 10,000 నగదు పారితోషికం ఇస్తామని ప్రకటించింది.

    ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన నాగాలాండ్ ప్రజలు ఇప్పుడప్పుడే రావొద్దని, వారందరికీ రూ. 10 వేల చొప్పున ఇస్తామని ప్రకటించింది.వలస కార్మికుల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నకారణంగా నాగాలాండ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

    ప్రస్తుతం నాగాలాండ్ కరోనా రహిత రాష్ట్రంగా ఉంది. ఇటువంటి సమయంలో వలస కూలీలు తిరిగి వస్తే కరోనా ఎక్కడ వ్యాప్తి చెందుతుందోనన్న ఆందోళనతో ఎక్కడి వారు అక్కడే ఉండేలా ఖర్చులు, ఇతర అవసరాల కోసం రూ. 10 వేల ఆర్థిక సాయం ప్రకటించింది