https://oktelugu.com/

ఏపీలో ప్రతి ఇంట్లో ఒకరికి కరోనా టెస్ట్

గత రెండు వారాలుగా కరోనా టెస్ట్ లను పెంచుతూ ఉండడంతో ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తున్నది. అయినా ఈ టెస్ట్ లను మరింత ఉధృతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకొంటున్నది. తాజాగా, ప్రతి ఇంట్లో ఒకరికి టెస్ట్ జరపాలని నిర్ణయించింది. జగన్ కొలువులో సలహాదారు.. రాజీనామా వెనుక కథేంటి? ప్రపంచ వ్యాప్తంగా ఎవరైతే ఎక్కువగా కరోనా టెస్ట్ లు నిర్వహిస్తున్నారో అటువంటి దేశాల్లో కరోనా కట్టడిలో విజయవంతం అవుతూ వస్తూ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 3, 2020 / 02:07 PM IST
    Follow us on


    గత రెండు వారాలుగా కరోనా టెస్ట్ లను పెంచుతూ ఉండడంతో ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తున్నది. అయినా ఈ టెస్ట్ లను మరింత ఉధృతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకొంటున్నది. తాజాగా, ప్రతి ఇంట్లో ఒకరికి టెస్ట్ జరపాలని నిర్ణయించింది.

    జగన్ కొలువులో సలహాదారు.. రాజీనామా వెనుక కథేంటి?

    ప్రపంచ వ్యాప్తంగా ఎవరైతే ఎక్కువగా కరోనా టెస్ట్ లు నిర్వహిస్తున్నారో అటువంటి దేశాల్లో కరోనా కట్టడిలో విజయవంతం అవుతూ వస్తూ ఉండడంతో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు.

    ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలో శ‌నివారం రాత్రి ప్రతి ఇంట్లో ఒకరికి చొప్పున కరోనా పరీక్షలు చేశారు. స్థానిక గ్రామ వాలంటీర్లు తమ పరిధిలోని 50 కుటుంబాల్లో ఒక్కొక్కరిని తీసుకెళ్లి పరీక్షలు జరిపించారు. ఈ ఫలితాలు రెండు రోజుల్లో వస్తాయి.

    కోడెల `ఆత్మహత్య’ మిస్టరీపై టీడీపీ, వైసీపీ రాజకీయం!

    తాజా నిర్ణయం ప్రకారం ప్రభుత్వం ముందుగా రెడ్ జోన్ జిల్లాలైన కర్నూలు, గుంటూరు, కృష్ణ, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరులో ఇంటికొకరికి కరోనా టెస్టులు జరిపించబోతోంది. ఒకవేళ ఇలాంటి టెస్టుల్లో ఎవరికైనా పాటిజివ్ వస్తే… వెంటనే ఆ వ్యక్తి ఉంటున్న ఇల్లు, చుట్టుపక్కల ఇళ్లలో అందరికీ టెస్టులు జరిపించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.