Homeఆంధ్రప్రదేశ్‌AP Government: విరాళాల కోసం ఏపీ ప్రభుత్వం ఎదురుచూపులు.. వేలకోట్లు ఎవరిస్తరు..?

AP Government: విరాళాల కోసం ఏపీ ప్రభుత్వం ఎదురుచూపులు.. వేలకోట్లు ఎవరిస్తరు..?

AP Government: ఏపీ ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయింది.కొత్తగా అప్పులు పుట్టడం లేదు. రాష్ట్రంలో పన్నులు ద్వారా వచ్చే ఆదాయం ఉద్యోగుల జీతాలు, సంక్షేమ పథకాలకే సరిపోతుంది. కొత్తగా ఏదైనా అభివృద్ధి పనులు చేపట్టాలంటే కొత్తగా అప్పు చేయాల్సిందే. ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి దాదాపు రూ.4లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని తెలుస్తోంది. పోలవరం, విభజన హామీల ప్రకారం కేంద్రం నుంచి ఆర్థిక సహకారం అందితేనే జగన్ ప్రభుత్వం ముందుకు వెళ్లాల్సి వస్తోంది. లేకపోతే ఎక్కడిపనులు అక్కడే ఆగిపోవాల్సిందే. గత ప్రభుత్వం రాజధాని కోసం చేపట్టిన నిర్మాణాలు కూడా ఆగిపోయాయి. కొందరు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో వారు కొత్త నిర్మాణాలు కూడా చేపట్టేందుకు సిద్ధంగా లేరు. బిల్లుల కోసం కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని సమాచారం.

AP Government
AP Government

ఈ క్రమంలోనే నాడు-నేడు కింద జగన్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల కోసం దేశీయంగా, అంతర్జాతీయంగా విరాళాలు సేకరించాలని ప్రభుత్వం భావిస్తోందట. ఏదేమైనా విరాళాలు వందలు, వేలు, లక్షల్లో వస్తాయి కావొచ్చు. కానీ వేల కోట్లల్లో ఎలా వస్తాయని మేధావులు, సమాజిక వేత్తలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం అక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదులు కట్టించాలని అనుకుంటోంది.

Also Read: పెళ్లి వద్దు, బాయ్ ఫ్రెండ్సే ముద్దు – శృతి హాసన్

నాడు – నేడు పేరుతో ఇప్పటి వరకూ కొన్ని స్కూళ్లలో కొత్త బల్లలు, బ్లాక్ బోర్డులు, పెయింటింగ్ లాంటి పనులు చేశారు. ఇప్పుడు అదనపు తరగతి గదుల కోసం డబ్బులు కావాలి. ఖజానా ఖాళీ అయ్యింది. అప్పులు పుట్టే పరిస్థితి లేదు. అందుకే విరాళాల కోసం చేయి చాచినట్టు తెలిసింది. స్కూళ్లలో అదనపు తరగతి గదుల కోసం రూ.6321 కోట్లు అవసరమని గుర్తించి జాతీయ, అంతర్జాతీయ దాతృత్వ సంస్థల నుంచి విరాళాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన విధివిధానాల కోసం త్వరలోనే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ కానున్నాయి.

 

సాధారణంగా దాతలు ఒక పాఠశాలకు లేదా కొన్ని పాఠశాలలకు కలిపి విరాళం ఇవ్వొచ్చు..విరాళం ఇచ్చినట్లు దాతలకు ఒక సర్టిఫికెట్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. అయితే, ప్రభుత్వానికి అప్పులే ఇవ్వడం లేదు.. ఇక విరాళాలుగా వేల కోట్లు ఇస్తారా? అన్నది మాత్రం జవాబు లేని ప్రశ్నగా మిగిలింది. అయితే, విదేశాల నుంచి విరాళాలు తీసుకునే విషయంలో కేంద్రం ఇటీవల అనేక ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం నిర్ణయం ఎంతమేర సత్ఫలితాలను ఇస్తుందనేది వేచిచూడాల్సిందే.

Also Read: ఇక పై బెడ్ సీన్స్ లో నటించను – అనుపమ పరమేశ్వరన్

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Exit mobile version