Fever survey: దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఇటు తెలంగాణలో కూడా కేసులు భారీగానే పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ తో పాటు డెల్టా వేరియంట్ కేసులు కూడా భారీగానే పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రంలో చాలామందికి జ్వరాలు, దగ్గు, జలుబు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే సెకండ్ వేవ్ సమయంలో ఉన్న పరిస్థితులు మరోసారి కనిపిస్తున్నాయి. దీంతో మొన్న కేబినెట్ మీటింగ్‌లో ప్రధానంగా కరోనా పరిస్థితుల మీదనే చర్చలు జరిపారు. రాష్ట్రంలో కేసులు ఏ మేరకు నమోదవుతున్నాయి, పరిస్థితులు ఎలా ఉంటున్నాయనే దానిమీదనే చర్చించారు.

ఇక మంత్రుల సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో గతంలో లాగే మరోసారి ఫీవర్ సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. ఇక ఈ ఫీవర్ సర్వే రేపటి నుండే నిర్వహించాలని కూడా ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఫీవర్ సర్వేలో జ్వరం లాంటి లక్షనాలు ఉన్న వారికి మెడిసిన్ కిట్లు ఇచ్చినట్టే.. ఈ సారి కూడా ప్రతి పేషెంట్‌కు రూ.200 విలువ చేసే డైట్ ప్లాన్ అందజేయాలని మంత్రులు తెలిపారు. అయితే ఈ సారి మాత్రం ఇంటింటికీ ఆరోగ్యం అనే పేరుతోనే ఈ తరహా జ్వరం సర్వే చేయనున్నారు.
Also Read: విరాళాల కోసం ఏపీ ప్రభుత్వం ఎదురుచూపులు.. వేలకోట్లు ఎవరిస్తరు..?

ఇక ఈ సర్వే చేయడం కోసం చాలా బృందాలు రంగంలోకి దిగుతున్నాయి. ఒక్కో బృందం రోజుకు కనీసం 25ఇండ్లకు వెళ్లి పరీక్షలు నిర్వహిస్తారు. ఎవరికైనా కొవిడ్ లక్షణాలు కనిపిస్తే వారికి కిట్ అందజేస్తారు. ఇక మండల కేంద్రాల్లో ఉన్న పీహెచ్‌సీల్లో కొవిడ్ ఓపీ సేవలు నిర్వహించనున్నారు. ఇక వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగానే నిర్వహించనున్నారు. ఈ సర్వేలో ఎవరికైనా లక్షణాలు ఎక్కువగా కనిపిస్తే మాత్రం వెంటనే వారిని దగ్గరలోని ఆస్పత్రిలో చేర్పిస్తారంట. ఒకవేళ కొవిడ్ నిర్ధారణ అయితే వారిని హోం ఐసోలేషన్ చేస్తారు. ఇక జీహెచ్ ఎంసీలో మరింత వేగంగా కొవిడ్ కట్టడికి చర్యలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది.