Anupama Parameswaran: యంగ్ మలయాళ బ్యూటీ ‘అనుపమ పరమేశ్వరన్’ అనగానే పద్దతిగా ఉంటుంది. అస్సలు బోల్డ్ సన్నివేశాల్లో నటించదు. పైగా ఆ అమ్మాయి హోమ్లీ నెస్ కి కేరాఫ్ అడ్రస్.. ఇలాంటి మాటలు వినిపించేవి అనుపమ గురించి. దీనికితోడు అనుపమ కూడా ఎన్నడూ ఓవర్ గా ఎక్స్ పోజ్ చేయలేదు. అలాగే అనవసరమైన వివాదాలలో దూరి బూతు కామెంట్లు చేయడం లాంటివి కూడా ఎప్పుడూ అనుపమ చేయలేదు. పైగా ఎప్పుడు సంప్రదాయ పద్ధతిలో కనిపిస్తూ సింపుల్ గా ఉంటుంది.

అయితే, మొదటి నుంచి గ్లామర్ షోకు దూరంగా ఉంటూ వచ్చిన ‘అనుపమ పరమేశ్వరన్’, ఒక్కసారిగా ‘రౌడీబాయ్స్” సినిమాలో రెచ్చిపోయి నటించింది. చాలా బోల్డ్ గా పోటీ పడి మరీ లిప్ కిస్ లు పెట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అనుపమ కిస్ సీన్లు చూసి నెటిజన్లతో పాటు సినీ ప్రముఖులు కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే.. అనుపమ పరమేశ్వరన్ పెట్టిన ముద్దులు.. మామూలు కిస్ సీన్లు కాదు. డీప్ లిప్ లాక్ లు.
Also Read: రెబల్ స్టార్ కి మెగాస్టార్ జన్మదిన శుభాకాంక్షలు !
పైగా ఒక లిప్ లాక్ కాదు, ఏకంగా మూడు సీన్లలో విచ్చలవిడిగా రెచ్చిపోయి అనుపమ నటించింది. సరే.. కిస్ సీన్లు సంగతి పక్కన పెడితే.. ఒక బెడ్ రూమ్ సీన్ కూడా ఉంది. దాంతో అనుపమ అభిమానులు ఆమెను విపరీతంగా ట్రోల్ చేశారు. మునుపెన్నడూ అనుపమ ఇంత హాట్ గా నటించలేదు కదా.. మరి ఎందుకు ఒక కొత్త హీరో సినిమాలో ఇలా ఎందుకు నటించింది ? ఈ సినిమా కథ ప్రకారం అలా చేసిందని సర్ది చెప్పుకోడానికి లేదు.

నిర్మాత దిల్ రాజు భారీగా డబ్బు ఇచ్చాడు కాబట్టే.. అనుపమ అలా లిప్ లాక్ ల విషయంలో పోటీ పడిందని టాక్ ఉంది. ఐతే, ఇక నుంచి అనుపమ హాట్ సీన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే అని తాజాగా ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో బలంగా పుకార్లు వినిపిస్తున్నాయి. పైగా అనుపమ కోసం అలాంటి ప్రత్యేక హాట్ సీన్లు రాస్తారట.
కానీ, అనుపమ మాత్రం ఇకపై అన్ని సినిమాల్లో ముద్దు సీన్లలో నటించను అని తేల్చి చెప్పిందట. ప్రస్తుతం ఆమె చేతిలో “18 పేజెస్”, “కార్తికేయ 2” సినిమాలున్నాయి.
Also Read: పూరి మ్యూజింగ్స్: హాలీవుడ్ ఎలా పుట్టిందో తెలుసా ?