https://oktelugu.com/

AP Cabinet Expansion Date Fixed: కేబినెట్ విస్తరణ ముహూర్తం ఈనెల 11కు జగన్ ఫిక్స్ అయ్యారా?

AP Cabinet Expansion Date Fixed: ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణపై జగన్ దృష్టి సారించారు. మంత్రివర్గ పునర్యవస్తీకరణపై కసరత్తు చేస్తున్నారు. రెండున్నరేళ్ల కిందటే మంత్రివర్గ విస్తరణ సందర్భంగా మళ్లీ విస్తరించి కొత్త వారికి అవకాశం కల్పిస్తామని చెప్పినట్లుగానే ప్రస్తుతం పాత వారిని తొలగించి వారిస్థానంలో కొత్త వారికి అవకాశం ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈనెల 11న కొత్త కేబినెట్ కొలువుదీరుతుందని చెబుతున్నారు. దీనికి గాను ఈనెల 8న గవర్నర్ హరిచందన్ భూషణ్ తో […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 30, 2022 / 08:49 AM IST
    Follow us on

    AP Cabinet Expansion Date Fixed: ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణపై జగన్ దృష్టి సారించారు. మంత్రివర్గ పునర్యవస్తీకరణపై కసరత్తు చేస్తున్నారు. రెండున్నరేళ్ల కిందటే మంత్రివర్గ విస్తరణ సందర్భంగా మళ్లీ విస్తరించి కొత్త వారికి అవకాశం కల్పిస్తామని చెప్పినట్లుగానే ప్రస్తుతం పాత వారిని తొలగించి వారిస్థానంలో కొత్త వారికి అవకాశం ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈనెల 11న కొత్త కేబినెట్ కొలువుదీరుతుందని చెబుతున్నారు. దీనికి గాను ఈనెల 8న గవర్నర్ హరిచందన్ భూషణ్ తో సమావేశమై మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశాలున్నాయి.

    CM JAGAN

    కేబినెట్ విస్తరణపై సీఎం జగన్ ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఎవరెవరిని కేబినెట్ లోకి తీసుకోవాలి? ఎవరికి పదవులు ఇవ్వాలనే దానిపై స్పష్టమైన క్లారిటీ ఇవ్వనున్నారు. దీని కోసం ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రభుత్వంలో ఎవరుంటారు? ఎవరు బయటకు వెళతారనే దానిపై అందరికి దిశా నిర్దేశం చేశారు. మంత్రులు తమ పదవుల నుంచి తప్పుకోవడానికి కూడా ఓకే చెప్పినట్లు చెబుతున్నారు. తమకు ఏ పదవి ఇచ్చినా పార్టీ బలోపేతం కోసం పాటుపడతామని సూచిస్తున్నారు.

    Also Read: CM Jagan Gets Negative Review: జగన్ కు మరో అవకాశం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా లేరా?

    CM JAGAN

    ఇప్పుడున్న మంత్రుల్లో ఎక్కువ శాతం మందిని తొలగించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వనున్నారు. కేబినెట్ విస్తరణతో రాబోయే ఎన్నికల్లో లబ్ధిపొందాలనే ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో వైసీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెబుతున్నారు. దీని కోసమే జగన్ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం. సమర్థులైన వారినే తమ మంత్రివర్గంలో చేర్చుకోనున్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి.

    Also Read: TDP: టీడీపీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి?

    Tags