https://oktelugu.com/

AP New Ministers: ఏపీ మంత్రివర్గ విస్తరణ డేట్ ఫిక్స్.. కొత్త మంత్రులెవరు?

AP New Ministers: కొత్త మంత్రివర్గంపై జగన్ సిద్ధంగా ఉండటంతో ఎమ్మెల్యేల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. ఇన్నాళ్లూ ఊరిస్తూ వస్తున్న ప్రక్రియ ఇక వేగవంతం కానుంది. దీంతో ఆశావహుల్లో సంబరాలు కలుగుతున్నాయి. మొదట ఈనెల 27నే ముహూర్తం ఖరారు చేసుకున్నా మళ్లీ మనసు మార్చుకున్నారు. ఈ క్రమంలో మంత్రివర్గ విస్తరణ కొలిక్కి వచ్చేనా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఏప్రిల్ రెండునే ఉగాది పండుగ నాడే కొత్త మంత్రుల కొలువుపై మొదట అంచనాలు వేసినా తరువాత తేదీ మార్పు […]

Written By:
  • Shiva
  • , Updated On : March 26, 2022 / 06:26 PM IST
    Follow us on

    AP New Ministers: కొత్త మంత్రివర్గంపై జగన్ సిద్ధంగా ఉండటంతో ఎమ్మెల్యేల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. ఇన్నాళ్లూ ఊరిస్తూ వస్తున్న ప్రక్రియ ఇక వేగవంతం కానుంది. దీంతో ఆశావహుల్లో సంబరాలు కలుగుతున్నాయి. మొదట ఈనెల 27నే ముహూర్తం ఖరారు చేసుకున్నా మళ్లీ మనసు మార్చుకున్నారు. ఈ క్రమంలో మంత్రివర్గ విస్తరణ కొలిక్కి వచ్చేనా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఏప్రిల్ రెండునే ఉగాది పండుగ నాడే కొత్త మంత్రుల కొలువుపై మొదట అంచనాలు వేసినా తరువాత తేదీ మార్పు జరిగింది.

    AP Cabinet

    వైసీపీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఏప్రిల్ 11న మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. గత మూడేళ్లుగా మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్న వారి కళ్లు కాయలు కాస్తున్నాయి. జీవితంలో తమకు మంత్రి పదవి దక్కుతుందో లేదోననే సందేహాల్లో పడిపోతున్నారు. దీంతో మంత్రివర్గ విస్తరణపై ఎంతో ఆతృతగా ఉన్నారు. మంత్రి పదవి అంటే ఆ మజాయే వేరు. బుగ్గ కారు, సెక్యూరిటీ తదితర సదుపాయాలు ఉండటంతో అందరికి మంత్రి పదవి అంటే మోజు కలుగుతోంది. అందుకే అందరు మంత్రులు కావాలని ఆశలు పెంచుకోవడం సహజమే.

    Also Read: CAG Report On AP: ఏపీ బడ్జెట్ లెక్కలు ‘కాగ్’ ఎందుకు బయటపెట్టలేదు?

    2019లోనే మంత్రివర్గ సమావేశంలో జగన్ చెప్పారు. రెండున్నరేళ్ల తరువాత మళ్లీ విస్తరణ చేపట్టి అందరికి మంత్రి పదవులు వచ్చేలా చూస్తానని మాట ఇచ్చారు. కానీ కరోనా కారణంగా ఆ ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో ఇక మంత్రివర్గ విస్తరణపై దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చేసంది. దీంతో సీఎం మంత్రి వర్గ విస్తరణపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. రాబోయే రోజుల్లో మంత్రి వర్గ విస్తరణ చేపట్టి వచ్చే ఎన్నికలకు టీంను సిద్ధం చేసుకోనున్నట్లు చెబుతున్నారు.

    ఇన్నాళ్లుగా మంత్రి పదవి కావాలని చూస్తున్న వారికి ఆశలు తీరే దారి కనిపిస్తోంది. ఇక మంత్రివర్గ విస్తరణ ఖాయమని తేలిపోవడంతో పదవులు సాధించేందుకు అధినేత మెప్పు కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల నేతలపై తిట్ల పురాణం అందుకుంటున్నారు. చెడామడా తిట్టేస్తున్నారు. జగన్ దృష్టిలో పడాలని భావిస్తున్నారు. తమకు మంత్రి పదవి కావాలని పదేపదే గుర్తు చేస్తున్నారు. మొత్తానికి మంత్రి వర్గ విస్తరణపై ఎమ్మెల్యేలు పెట్టుకున్న కోరికలు తీరేనా అని అందరిలో ఆసక్తి నెలకొంది. ఎవరెవరిని మంత్రి పదవులు వరిస్తాయో తెలియడం లేదు.

    Also Read: CM Jagan Three Capital Issue: మూడు రాజధానులతో జగన్ మళ్లీ గెలుస్తారా?

    Tags