Telangana Jobs: తెలంగాణ సర్కారు ఉద్యోగాల భర్తీ కోసం ప్రక్రియ వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకోసమే సెలబస్ ను కూడా తయారు చేయాలని సంకల్పిస్తోంది. అన్ని ఉద్యోగాల నియామకాల కోసం పరీక్షలు నిర్వహించి వచ్చిన మార్కుల ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వడానికి ముహూర్తం నిర్ణయిస్తోంది. సీఎస్ సోమేష్ కుమార్ నేతృత్వంలో సిలబస్ కోసం కమిటీని నియమిస్తోంది. ఇందులో నిపుణులైన వారిని నియమించి వారితో ప్రశ్నల తయారీకి మార్గనిర్దేశం చేస్తోంది.
గ్రూప్స్ తోపాటు పలు పరీక్షలు నిర్వహించేందుకు సర్కారు సిద్ధమైంది. పరీక్షల నిర్వహణ అనంతరం వాల్యూయేషన్ తదితర కార్యక్రమాలు నిర్వహించేందుకు సిబ్బంది అవసరమవుతారు. సిబ్బంది నియామకంలో గోప్యత పాటించాలని చూస్తోంది. సుదీర్ఘ అనుభవం, వివాదరహితులు, ఎలాంటి అభియోగాలు లేని వారిని తీసుకునేందుకు కమిటీ సూచనలు చేస్తోంది. పక్షం రోజుల్లో ఎంపిక ప్రక్రియ పూర్తి చేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.
Also Read: CM Jagan Three Capital Issue: మూడు రాజధానులతో జగన్ మళ్లీ గెలుస్తారా?
గ్రూప్ 1 లాంటి వాటికి రాతపరీక్ష, మౌఖిక పరీక్షలు ఉంటాయి. కొన్నింటికి పరీక్షలతోనే సరిపోతుంది. దీంతో ప్రభుత్వం ఇందుకు అవసరమైన మార్గదర్శకాలు రూపొందిస్తోంది. వర్తమాన అంశాలు, జనరల్ నాలెడ్జి, జనరల్ సైన్స్, ఆర్థిక, సామాజిక అంశాలు, భౌగోళిక స్వరూపం, చరిత్ర, సంస్కృతి, రాజ్యాంగం, పాలన తదితర వాటిపై నిపుణులైన వారిచే ప్రశ్నలు తయారు చేసేందుకు సిద్ధమవుతోంది. మొత్తం తెలంగాణ సిలబస్ మీదే ప్రశ్నలు ఉంటాయని తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమం, చరిత్ర, సామాజికాంశాల ఆధారంగా ప్రశ్నలు రూపొందే అవకాశమున్నట్లు సమాచారం.
ప్రభుత్వం సమర్థంగా పరీక్షలు నిర్వహించాలని ఉద్యోగాల భర్తీ కి సుముఖత వ్యక్తం చేస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ వేగవంతం చేస్తోంది. దీని కోసమే ప్రశ్నపత్రాల తయారీ పరీక్షల నిర్వహణపై దృష్టి కేంద్రీకరించింది. ఇప్పటికే 18 మంది నిపుణులతో కూడిన కమిటీని నియమించి తద్వారా సిలబస్ రూపొందించే విధానానికి శ్రీకారం చుట్టింది. సర్కారు తీసుకుంటున్న చర్యలతో ఉద్యోగాల ప్రక్రియ ఇక ఊపందుకోనుందని తెలుస్తోంది.
Also Read: CM KCR: వడ్ల కొనుగోలుపై కేసీఆరే ఇంత పని చేశారా.. అప్పుడెందుకు నిరసన చేయలేదు సార్..