https://oktelugu.com/

Competition For RRR: పోటీలో ‘ఆర్ఆర్ఆర్’ ఉన్నా మా సినిమా సూపర్ హిట్టే !

Competition For RRR: టాలెంటెడ్ బ్యూటీ తాప్సీ పన్ను బాలీవుడ్ లో గుడ్ కాన్సెప్ట్‌ లతో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అయితే ఈ క్రమంలో తెలుగులో చాలా గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ పోగొట్టడానికి తాజాగా ఈ అమ‍్మడు చేస్తోన్న తెలుగు సినిమా`మిష‌న్ ఇంపాజిబుల్‌`. కాగా ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమా ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తి చేసుకొంది. సినిమాకు యు/ఎ స‌ర్టిఫికెట్ వచ్చింది. ఇక ఏప్రిల్ 1న ఈ సినిమా విడుదల కానుంది. […]

Written By:
  • Shiva
  • , Updated On : March 26, 2022 / 06:22 PM IST
    Follow us on

    Competition For RRR: టాలెంటెడ్ బ్యూటీ తాప్సీ పన్ను బాలీవుడ్ లో గుడ్ కాన్సెప్ట్‌ లతో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అయితే ఈ క్రమంలో తెలుగులో చాలా గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ పోగొట్టడానికి తాజాగా ఈ అమ‍్మడు చేస్తోన్న తెలుగు సినిమా`మిష‌న్ ఇంపాజిబుల్‌`. కాగా ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమా ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తి చేసుకొంది. సినిమాకు యు/ఎ స‌ర్టిఫికెట్ వచ్చింది. ఇక ఏప్రిల్ 1న ఈ సినిమా విడుదల కానుంది.

    Mission Impossible

    అంటే.. వచ్చే వారం ఈ సినిమా రాబోతుంది. మరి “ఆర్ఆర్ఆర్” విడుదలైన వారం రోజులకే ‘మిషన్ ఇంపాజిబుల్’ థియేటర్లలోకి వస్తే.. ఎవరు చూస్తారు ? అదేమిటో గానీ, తమ సినిమాను “ఆర్ఆర్ఆర్” సినిమా మింగేస్తుందేమో అన్న భయం కూడా ఈ సినిమా మేకర్స్ లో లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తాప్సీలో ఈ మధ్య బాగా నమ్మకం పెరిగిపోయింది. మరో కంగనాలా ఆమె తీరు ఉంది.

    Also Read: Mahesh Babu Tweets On RRR: ‘ఆర్ఆర్ఆర్’ పై మహేష్ స్పందన.. వైరల్ అవుతున్న ట్వీట్స్ !

    పైగా మిష‌న్ ఇంపాజిబుల్‌` చిన్న చిత్రమే అయినా.. సినిమాలో కంటెంట్ పరంగా గొప్ప సినిమా అని ఇప్పటికే ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అందుకే.. ‘మిష‌న్ ఇంపాజిబుల్‌` రిలీజ్ విషయంలో తాప్సీ అస్సలు కాంప్రమైజ్ కావడం లేదు. ఆమె ఎంత స్ట్రాంగ్ గా ఉంది అంటే.. “ఆర్ఆర్ఆర్” ఉన్నా మా సినిమా హిట్ అయ్యి తీరుతుంది అంటూ డైరెక్ట్ గానే స్టేట్ మెంట్స్ పాస్ చేస్తోంది. మరి తాప్సీ నమ్మకం నిజం అవుతుందా ?

    అయినా నిజం కావడానికి తాప్సీ ఏమి సూపర్ స్టార్ కాదు కదా. ఎందుకు నిజం అవుతుంది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు అనుకోండి. ఇక ఈ సినిమాలో ప్ర‌ముఖ స్టార్స్ అంద‌రూ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌` చిత్రంతో మంచి హిట్ కొట్టిన టాలెంటెడ్ డైరెక్ట‌ర్ స్వ‌రూప్ ఆర్.ఎస్‌.జె ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు.

    తెలుగు ఇండస్ట్రీలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ల్లో ఒక‌టైన మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దీప‌క్ య‌ర‌గ‌ర సినిమాటోగ్రాఫ‌ర్‌ గా చేస్తుంటే.. మార్క్ కె రాబిన్ సంగీతం అందిస్తున్నాడు.

    Also Read: Prakash Raj Statement: పునీత్‌ సేవల విషయంలో ప్రకాష్ రాజ్ కీలక ప్రకటన !

    Tags