https://oktelugu.com/

నిమ్మగడ్డ కేసులో మరో ట్విస్ట్..!

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ఎస్.ఈ.సి కేసులో దాఖలైన పిటీషన్లపై కొద్ది రోజుల కిందట హైకోర్టు తీర్పు ఇస్తూ నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్ గా కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ తీర్పులో పేర్కొన్న అంశాలు కొన్ని నిమ్మగడ్డకు ప్రతికూలంగా మారాయనే వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను విచక్షణాధికారంతో గవర్నర్ నియమించాలే తప్ప..మంత్రి వర్గానికి ఎలాంటి అధికారం లేదని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. అదేవిధంగా రాష్ట్ర […]

Written By: , Updated On : June 10, 2020 / 10:20 AM IST
Follow us on

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ఎస్.ఈ.సి కేసులో దాఖలైన పిటీషన్లపై కొద్ది రోజుల కిందట హైకోర్టు తీర్పు ఇస్తూ నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్ గా కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ తీర్పులో పేర్కొన్న అంశాలు కొన్ని నిమ్మగడ్డకు ప్రతికూలంగా మారాయనే వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను విచక్షణాధికారంతో గవర్నర్ నియమించాలే తప్ప..మంత్రి వర్గానికి ఎలాంటి అధికారం లేదని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మగడ్డను ఎస్.ఈ.సిగా తొలగించేందుకు తెచ్చిన ఆర్డినెన్స్ ను, కనగరాజ్ నియామకానికి ఇచ్చిన రెండు జి.ఒలను రద్దు చేసిన విషయం విదితమే.

ఇది ఇలా ఉండగా నిమ్మగడ్డ నియామకం చెల్లదంటూ, ఆయనను ఆ పదవి నుంచి తిలగించాలని తాజాగా హైకోర్టులో మరో పిటీషన్ దాఖలు అయ్యింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను 2016 అప్పటి టీడీపీ మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయం తీసుకుని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించింది. దీంతో నిమ్మగడ్డ నియామకం చెల్లదని, అప్పటి ప్రభుత్వం ఇచ్చిన జి.ఓను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేసిన మాజీ ఐజీ సుందర్ కుమార్ దాస్ హైకోర్టును కోరారు.

ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ పై ఈ రోజు విచారణ జరగనున్న నేపథ్యంలో కేసులో సర్వతా ఆసక్తి నెలకొంది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడం, హైకోర్టు పేర్కొన్న విధంగా గవర్నర్ నిమ్మగడ్డను ఎస్.ఈ.సిగా నియమించక పోవడంతో నిమ్మగడ్డ నియామకం చెల్లదని ప్రభుత్వం తన పిటీషన్ లో పేర్కొంది. నిమ్మగడ్డ తరుపు న్యాయవాదులు మాత్రం ప్రస్తుతం పదవిలో ఉన్న నిమ్మగడ్డకు ఈ అంశం వర్తించడదని తదుపరి నియామకాలు చేపట్టే క్రమంలో ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. సుప్రీం ధర్మాసనం నిమ్మగడ్డకు ఎన్నికల కమిషనర్ నియమిస్తే సుప్రీంకోర్టు లో రాష్ట్ర ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలేనట్టే.