నూతన్ నాయుడుపై నాలుగో కేసు.. దిమ్మదిరిగే వాస్తవాలు

నూతన్ నాయుడు.. బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయిన  ఈ దర్శకుడు ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో పడిపోయాడు. వాటి నుంచి బయటపడడం దాదాపు అసాధ్యంగా ఉంది. విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో దళిత యువకుడికి శిరోముండనం కేసులో బిగ్ బాస్ సెలెబ్రెటీ, దర్శకుడు నూతన్ నాయుడు అరెస్ట్ అయ్యాడు. అయితే ఈ కేసులో ఇప్పుడు దిమ్మదిరిగే వాస్తవాలు బయటపడుతున్నాయి. Also Read: ‘బిగ్ బాస్ సీజన్ 4’ కంటెస్టెంట్స్ వీళ్ళే ! నూతన్ నాయుడు తన భార్య ప్రియను […]

Written By: NARESH, Updated On : September 6, 2020 3:52 pm

nutan naidu

Follow us on


నూతన్ నాయుడు.. బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయిన  ఈ దర్శకుడు ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో పడిపోయాడు. వాటి నుంచి బయటపడడం దాదాపు అసాధ్యంగా ఉంది. విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో దళిత యువకుడికి శిరోముండనం కేసులో బిగ్ బాస్ సెలెబ్రెటీ, దర్శకుడు నూతన్ నాయుడు అరెస్ట్ అయ్యాడు. అయితే ఈ కేసులో ఇప్పుడు దిమ్మదిరిగే వాస్తవాలు బయటపడుతున్నాయి.

Also Read: ‘బిగ్ బాస్ సీజన్ 4’ కంటెస్టెంట్స్ వీళ్ళే !

నూతన్ నాయుడు తన భార్య ప్రియను కాపాడేందుకు ఏకంగా ఏపీ సీఎంవో అడిషనల్ చీఫ్ సెక్రెటరీగా పనిచేస్తున్న పీవీ రమేశ్ తోపాటు మరికొందరి పేర్లను వాడుకొని మోసాలకు పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. పోలీసులకు ఫోన్లు చేసినట్టు సమాచారం.

నూతన్ నాయుడు మోసగాడని.. 8297989375 తోపాటు ఇతర నంబర్ల నుంచి తన పేరు చెప్పి పలువురికి ఫోన్లు చేశాడని.. డబ్బులు, ఇతర ప్రయోజనాలు డిమాండ్ చేసినట్టు తన దృష్టికి వచ్చిందని ఏపీ సీఎంవో అడిషనల్ చీఫ్ సెక్రెటరీ పీవీ రమేశ్ ట్వీట్ చేశారు.

. ఇప్పటికే ఈ కేసులో నూతన్ భార్యతోపాటు ఏడుగురు అరెస్ట్ అయ్యారు. వారిని కాపాడే ప్రయత్నంలో ప్రముఖల పేర్లతో ఫోన్లు చేసి నూతన్ బుక్కయ్యాడు. తాజాగా నూతన్ పై మరో కేసు నమోదైంది. ఆగస్టు 29న ప్రముఖ వ్యక్తి పేరుతో ఫోన్ చేశాడు నూతన్. వైద్యపరీక్షల్లో అతడి భార్య రిపోర్టును మేనేజ్ చేయాలని కోరాడు. దీంతో సదురు డాక్టర్ కు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నూతన్ నాయుడిపై చీటింగ్ కేసు నమోదైంది.

Also Read: ‘రాం గోపాల్‌వ‌ర్మ`‌కు యూట్యూబ్‌లో షాక్‌..!

నూతన్ నాయుడు ఇప్పటికే ఏపీసీఎంవో కార్యదర్శి పీవీ రమేశ్ పేరును వాడి ఫేక్ కాల్స్ చేశాడని కేసు నమోదైంది. ఇప్పుడు డాక్టర్ సుజాత, సీఐ సూరిబాబు ఫిర్యాదుతో గాజువాకలో మరో రెండు కేసు నమోదైంది. ఇక కంచెరపాలెంలో మరో బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు నూతన్ పై చీటింగ్ కేసు నమోదు చేశారు. దీంతో మొత్తం 4 కేసులు నూతన్ పై నమోదయ్యాయి.