https://oktelugu.com/

‘రాం గోపాల్‌వ‌ర్మ`‌కు యూట్యూబ్‌లో షాక్‌..!

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ ఇటీవల వ్యక్తులను టార్గెట్ చేసేలా సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెల్సిందే. ఆయన సినిమాపై ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే కథను పబ్లిక్ డోమన్ నుంచి తీసుకున్నారని దాటవేసే ధోరణిలో మాట్లాడేవారు. ఇక తన సినిమా విషయంలో అభిమానులు వ్యక్తంచేసే సూచనలు సైతం ఆయన పెడచెవిన పెడుతుంటారు. అయితే ఇటీవల పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ దర్శకుడు రాంగోపాల్ వర్మ‘పవర్ స్టార్’ మూవీని తెరకెక్కించాడు. Also Read: ‘బిగ్ బాస్ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 6, 2020 / 03:14 PM IST
    Follow us on

    వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ ఇటీవల వ్యక్తులను టార్గెట్ చేసేలా సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెల్సిందే. ఆయన సినిమాపై ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే కథను పబ్లిక్ డోమన్ నుంచి తీసుకున్నారని దాటవేసే ధోరణిలో మాట్లాడేవారు. ఇక తన సినిమా విషయంలో అభిమానులు వ్యక్తంచేసే సూచనలు సైతం ఆయన పెడచెవిన పెడుతుంటారు. అయితే ఇటీవల పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ దర్శకుడు రాంగోపాల్ వర్మ‘పవర్ స్టార్’ మూవీని తెరకెక్కించాడు.

    Also Read: ‘బిగ్ బాస్ సీజన్ 4’ కంటెస్టెంట్స్ వీళ్ళే !

    ఈ మూవీ విషయంలో రాంగోపాల్ వర్మ, పవన్ అభిమానుల మధ్య మాటలయుద్ధం నడిచింది. పవన్ అభిమానులు నేరుగా రాంగోపాల్ వర్మ ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చినంత పనిచేశారు. దానిని కూడా రాంగోపాల్ వర్మ పబ్లిసిటీ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో రాంగోపాల్ వర్మను టార్గెట్ చేస్తూ పలువురు సినిమాలను తెరక్కించనున్నట్లు ప్రకటించారు. పవన్ అభిమాని, బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన నూతన్ నాయుడు రాంగోపాల్ వర్మపై ‘పరాన్నజీవి’ అనే సినిమాను తెరకెక్కించారు. పవర్ స్టార్ సినిమా రిలీజు రోజునే పోటాపోటీగా ఈ సినిమాను విడుదల చేసిన సంగతి తెల్సిందే. అయితే ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి.

    ఇప్పటికే జోన్న విత్తుల ‘ఆర్జీవీ’ పేరుతో ఓ బయోపిక్ తెరెక్కిస్తున్నాడు. ఆర్జీవి.. రోజు గిల్లే వాడు అంటూ క్యాప్షన్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డేరా బాబా.. వన్స్ అపాన్ ఎ టైం అనే సినిమాలు కూడా వర్మ పై తెరకెక్కిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సినీయర్ జర్నలిస్టు ప్రభు దర్శకత్వంలో ‘రాంగోపాల్ వర్మ’ సినిమా రాబోతుంది. పవన్ పుట్టిన రోజు సందర్భంగా ‘రాంగోపాల్ వర్మ’ నుంచి యూట్యూబ్లో ఓ సాంగ్ ను దర్శకుడు ప్రభు రిలీజ్ చేశాడు. ‘వర్మా.. ఇలా కాలిందేమిటయ్య నీ కర్మ..’ సాంగ్ ను పవన్ అభిమానులకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించాడు.

    Also Read: అదే ‘వి’ సినిమా కొంప ముంచిందా?

    అయితే ప్రస్తుతం యూట్యూబ్ నుంచి ఈ సాంగ్ ను ఎవరో డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై చిత్రబృందం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా కాపీ రైట్ ఇష్యూ వంటి సమస్యలు ఎదురైతేనే యూట్యూబ్ వాటిని డిలీట్ చేస్తుంది. అయితే ఈ పాటకు అలాంటి సమస్య లేకుండా యూట్యూబ్లో కన్పించకుండా పోవడంపై చిత్రబృందం ఆరా తీస్తోంది. ఇది హ్యాకర్స్ పనా? లేదా ఎవరైనా కావాలని చేశారా? అని తెలుసుకునే పనిలో చిత్రబృందం పడింది. దీనిపై త్వరలోనే చిత్రబృందం క్లారిటీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.