ఎట్టకేలకు మోదీ రక్తపు మరకను తొలగించుకున్నాడా?

ఎన్నో ఏళ్లుగా మోదీపై ఉన్న రక్తపు మరకలను ఎట్టకేలకు తొలగినట్లే కన్పిస్తున్నాయి. ప్రస్తుతం దేశ ప్రధాని ఉన్న మోదీ గతంలో గుజరాత్ సీఎం మూడుసార్లు హ్యట్రిక్ సాధించారు. 2014వరకు కూడా ఆయన గుజరాత్ సీఎంగా కొనసాగారు. అయితే 2014 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బంపర్ మోజార్టీతో కేంద్రంలోకి అధికారంలోకి వచ్చింది. దీంతో బీజేపీ అధిష్టానం బలపర్చిన మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఇక 2019లోనూ మోదీ నేతృత్వంలో బీజేపీ ఎన్నికలకు వెళ్లి రెండోసారి అధికారంలోకి వచ్చిన సంగతి […]

Written By: NARESH, Updated On : September 6, 2020 3:55 pm
Follow us on

ఎన్నో ఏళ్లుగా మోదీపై ఉన్న రక్తపు మరకలను ఎట్టకేలకు తొలగినట్లే కన్పిస్తున్నాయి. ప్రస్తుతం దేశ ప్రధాని ఉన్న మోదీ గతంలో గుజరాత్ సీఎం మూడుసార్లు హ్యట్రిక్ సాధించారు. 2014వరకు కూడా ఆయన గుజరాత్ సీఎంగా కొనసాగారు. అయితే 2014 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బంపర్ మోజార్టీతో కేంద్రంలోకి అధికారంలోకి వచ్చింది. దీంతో బీజేపీ అధిష్టానం బలపర్చిన మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఇక 2019లోనూ మోదీ నేతృత్వంలో బీజేపీ ఎన్నికలకు వెళ్లి రెండోసారి అధికారంలోకి వచ్చిన సంగతి తెల్సిందే.

Also Read: డిజిటల్ ప్రచారంలో దూసుకెళుతున్న బీజేపీ?

గుజరాత్ సీఎంగా మోదీ ఉన్నప్పుడే గోద్రా అల్లర్ల సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో దాదాపు వెయ్యిమంది మృతిచెందారు. వీరిలో ఎక్కువగా మైనార్టీలు ఉండటంతో ఈఘటన మతంరంగు పులుముకుంది. మోదీ వ్యతిరేకులంతా ఏకమై ఈ సంఘటనకు మోదీ కారణమని ఆరోపణలు గుప్పించారు. దీంతో నాటి కేంద్ర ప్రభుత్వం సైతం ఈ ఘటనపై నానావతి కమిషన్ వేసింది. దీనిపై సుదీర్ఘ విచారణ చేపట్టిన కమిషన్ గోద్రా అల్లర్ల కేసులో మోదీకి సంబంధం ఉందని చెప్పడానికి ఎలాంటి ఆధారం లేదంటూ 2002సంవత్సరంలో క్లీన్ చీట్ ఇచ్చింది.ఇదిలా ఉండగా 2002 గోద్రా అల్లర్ల కేసులో సీఎం మోదీ ప్రమేయం ఉందని.. ఆయన నుంచి తమకు నష్టపరిహారం ఇప్పించాలంటూ గుజరాత్లోని సబర్కంతా దిగువ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రత్యర్థుల దాడిలో ముగ్గురు ముస్లింలు చనిపోగా వారి తరుపున బ్రిటన్ చెందిన ఓ కుటుంబం 2004లో స్థానిక కోర్టులో వాజ్యాన్ని దాఖలు చేసింది. తమ కుటుంబాల మృతికి సీఎం మోదీనే కారణమని తమకు నష్టపరిహారం కింద 24కోట్లు చెల్లించాలని పిటిషన్లో డిమాండ్ చేశారు. దీనిపై సుదీర్ఘ విచారణ చేపట్టిన దిగువ కోర్టు.. నాటి అల్లర్లకు మోదీనే కారణమని చెప్పలేమంటూ కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. సదరు పిటిషన్ మోదీ పేరును తొలగిస్తూ ఆదివారం తీర్పును వెలువరించింది.

Also Read: సంచలన విషయాలు : సుశాంత్‌ డ్రగ్స్‌ తీసుకునేవాడా..?

కోర్టు ఇచ్చిన తీర్పును బీజేపీ నేతలు స్వాగతిస్తున్నారు. తాము ఎప్పటి నుంచి ఈ విషయాన్నే చెబుతామని తాజాగా కోర్టు కూడా స్పష్టం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రత్యర్థులు రాజకీయ కక్షతో తప్పుడు ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని హితవు పలుకుతున్నారు. గోద్రా అల్లరపై కేంద్రం గతంలోనూ తేల్చిందని.. తాజాగా కోర్టు తీర్పు ద్వారా మరోసారి ప్రజలకు తెలిసిందన్నారు. బీహర్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గోద్రా అల్లర్ల కేసులో మోదీకి మరోసారి క్లీన్ చీట్ రావడం చర్చనీయాంశంగా మారింది. దీంతో మోదీపై ఉన్న రక్తపు మరకలు తొలగినట్లే అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. దీనిపై ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సిందే..!