Ankita Bhandari: ఊరికి చెరువు.. చేనుకు తోవ.. మనిషికి జ్ఞానం.. దారి తప్పిన వారిని కట్టడి చేసేందుకు వ్యవస్థ ఉండాలి అంటారు పెద్దలు. కానీ మన వ్యవస్థ లో ఉన్న లోపాలే చట్ట వ్యతిరేకులకు వరాలవుతున్నాయి. వ్యభిచారానికి ఒప్పుకోలేదని ఉత్తరాఖండ్ యమకేశ్వర్ లో రిసెప్షనిస్ట్ అంకితబండారీని హత్య చేసిన కేసులో రిసార్ట్ నిర్వాహకుడు పులకిత్ ఆర్య దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అతడు బిజెపి నాయకుడి కావడంతో ఇష్టానుసారంగా వ్యవహరించాడు. వ్యవస్థలను తూచ్ అన్నాడు. అధికారులను డబ్బులతో కొనేశాడు. దేవ భూమి లాంటి ఉత్తరఖండ్‌లో చేయకూడని పనులు చేశాడు. అంకిత బండారి హత్య ఒకటే కాదు పులకిత్ ఆర్య చేసిన దారుణాలు ఇంకా చాలా ఉన్నాయి. తవ్వుతుంటే పోలీసులకే కాదు స్థానిక అధికారులకు కూడా మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు తెలుస్తున్నాయి.

..
ముందుగా చెప్పినట్టు పులకిత్ ఆర్య బిజెపి నాయకుడి కొడుకు. అతడికి చెందిన వనంతర రిసార్ట్ నుంచి 8 నెలల క్రితం అదృష్టమైన ప్రియాంక వ్యవహారం తాజాగా బయటపడింది. ప్రియాంక కూడా అంకిత స్వగ్రామమైన పౌరి గడ్వాల్ కు చెందినవారే. రిసార్ట్‌లోనే పనిచేస్తూ ఆకస్మాత్తుగా ప్రియాంక అదృశ్యమయ్యారు. దీనిపై కుటుంబ సభ్యులు పులకిత్ ఆర్యను నిలదీస్తే “మీ అమ్మాయి ఒక దొంగ. రిసార్ట్ లో నగదు విలువైన వస్తువులతో పారిపోయిందంటూ” దబాయించాడు. తాజాగా అంకితను పులకిత్ చంపేసిన విషయం వెలుగులోకి రావడం తో ప్రియాంకనూ చంపేసి ఉంటాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పులకిత్ వనంతర రిసార్ట్ ఉన్న ప్రాంతంలోనే గతంలో మిఠాయి దుకాణం నిర్వహించాడు. అందులో పనిచేస్తున్న ఒక కార్మికుడు జీతం అడిగినందుకు అక్రమంగా నిర్బంధించాడు. అరవింద్ హత్వాల్ అనే సామాజిక కార్యకర్త గ్రామ సర్పంచి ద్వారా పులకిత్ మీద ఒత్తిడి తెచ్చి ఆ కార్మికుడికి విముక్తి కలిగించారు. 2020లో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన కేసు కూడా పులకిత్ పై ఉంది. ఓ బాలిక హత్య కేసులో ప్రస్తుతం జైల్లో శిక్ష అనుభవిస్తున్న కళంకిత రాజకీయ నాయకుడు అమరమణి త్రిపాఠి తో కలిసి ట్రావెల్ పాస్ లేకుండా బద్రీనాథ్ ఆలయ రోడ్లోకి ప్రవేశించినందుకు అప్పట్లో పులకిత్ పై కేసు నమోదయింది.
..
ఆధారాలు చేర్పిస్తున్నారా

..
పులకిత్ ఆర్య చేసిన హత్యలకు సంబంధించి ఆధారాలను చేరిపి వేసేందుకు ఉత్తరఖాండ్ లోని బిజెపి ప్రభుత్వం ఆదివారం అర్ధరాత్రి బుల్డోజర్ తో వనంతర రిసార్ట్ ను కూల్చివేసిందని అంకిత బండారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరణానికి ముందు ఆమెపై దాడి చేశారని ప్రోవిజినల్ పోస్ట్ మార్టం నివేదిక నిర్ధారించినప్పటికీ, నీటిలో ముని పోవడం వల్లే ప్రాణం పోయిందని అందులో పేర్కొన్నారు. దీంతో తుది పోస్ట్‌మార్టం నివేదిక వచ్చేవరకూ అంకిత మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించబోమని ఆమె కుటుంబ సభ్యులు భీష్ముంచు కూర్చున్నారు. నిధితులకు మరణ శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా అంకిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆదివారం రిషికేష్ బద్రీనాథ్ జాతీయ రహదారిపై స్థానికులు ఆందోళన చేపట్టడంతో కొన్ని గంటలపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. శనివారం నిందితులను తరలిస్తున్న పోలీసు వాహనాన్ని శనివారం స్థానికులు అడ్డుకొని వారిని చితక్కొట్టారు. కాగా దర్యాప్తు వేగవతానికి డీఐజీ రేణుకా దేవి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పులకిత్ ఆర్య హత్యోదంతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఉత్తరాఖండ్ లోని బిజెపి చిక్కుల్లో పడింది. మరో ఏడాదిలో శాసనసభకు ఎన్నికలు ఉండడంతో పుల కిత్ ఆర్య ఉదంతం ఆ పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చి పెట్టేలా ఉంది. కాగా పులకిత్ ఆర్య తండ్రిని పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీనిపై అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.