Chiru God Father Movie Highlights: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన గాడ్ ఫాదర్ చిత్రం మలయాళం లో సూపర్ హిట్ అయినా మోహన్ లాల్ లూసిఫెర్ రీమేక్ అనే విషయం మన అందరికి తెలిసిందే..తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు..అక్టోబర్ 5 వ తారీఖున తెలుగు , హిందీ మరియు మలయాళం బాషలలో విడుదల అవ్వబోతున్న ఈ సినిమా ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని UA సర్టిఫికెట్ ని పొందింది..భారీ అంచనాల నడుమ విడుదల అవ్వబోతున్న ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతూ అభిమానులను ఖుషి చేస్తుంది..ఇక అసలు విషయానికి వస్తే ఆచార్య సినిమా అభిమానుల్లో నింపిన నిరుత్సాహాన్ని గాడ్ ఫాదర్ చిత్రం చెరిపేయబోతుందట..సినిమా ప్రారంభం నుండి ఎండింగ్ వరుకు చిరంజీవి అభిమానులకు ఈ సినిమా ఒక ఫీస్ట్ లాగ ఉంటుందని సమాచారం..చిరంజీవి పాత్రని దర్శకుడు మలచిన తీరు అద్భుతం అట..ఒరిజినల్ వెర్షన్ ని చూస్తే కాస్త స్లో గా ఉన్నట్టు అనిపిస్తుంది..కానీ తెలుగు లో మాత్రం స్క్రీన్ ప్లే పరుగులు తీసే విధంగా డైరెక్టర్ మార్చాడట.

ఇక ఈ సినిమాలో చిరంజీవి మరియు నయనతార మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయట..ఇందులో నయనతార చిరంజీవి కి చెల్లెలు గా నటిస్తుంది..ఫస్ట్ హాఫ్ మొత్తం లో రెండు మూడు ఫైట్స్ మెగాస్టార్ ఫాన్స్ కి పూనకాలు రప్పించే విధంగా ఉంటుందట..ముఖ్యంగా జైలు లో వచ్చే ఫైట్ సీన్ ఇటీవల కాలం లో వచ్చిన చిరంజీవి సినిమాలలో ‘ది బెస్ట్’ గా ఉండబోతుందట..ఇక ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ ఒక ముఖ్య పాత్రలో నటించిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇటీవలే వీల్లద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘తార్ మార్ తక్కర్ మార్’ అనే పాట సోషల్ మీడియా లో ఊపేస్తోంది..అది పక్కన పెడితే చిరంజీవి మరియు సల్మాన్ ఖాన్ కాంబినేషన్ సన్నివేశాలు అద్భుతంగా వచ్చినట్టు సమాచారం..ముఖ్యం గా చివరి 15 నిమిషాలు ఈ సినిమా కి పెద్ద హైలైట్ గా నిలవబోతుందట..ఇలా ఆద్యంతం ఉత్కంఠ భరితంగా ఆసక్తి గా ఈ సినిమా సాగుతుందట..ఇక ఈ సినిమాలో విలన్ గా ప్రముఖ యువ హీరో సత్యదేవ్ నటించిన సంగతి మన అందరికి తెలిసిందే..ఆయన ఇందులో నయనతార కి భర్త గా నటించాడు..ఇలా ఎన్నో ప్రత్యేకతలు మరియు పాజిటివ్ బజ్ మీద విడుదల అవ్వబోతున్న ఈ సినిమా అభిమానులను ఎంత వరుకు ఆకట్టుకుంటుందో చూడాలి.
