https://oktelugu.com/

ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. ఆ రుణాలపై అదిరిపొయే ఆఫర్లు..?

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు మరో శుభవార్త చెప్పింది. పర్సనల్ లోన్ నుంచి హోం లోన్ వరకు అదిరిపోయే ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. అయితే కస్టమర్లు ఎవరైతే లోన్ తీసుకుంటారో వారు మాత్రమే ఎస్బీఐ అందించే ప్రయోజనాలను పొందగలుగుతారు. ఇప్పటికే ప్రైవేట్ రంగ బ్యాంకులతో పోల్చి చూస్తే ఎస్బీఐ తక్కువ వడ్డీకే రుణాలను ఇస్తోంది. ఎస్బీఐ ప్రస్తుతం పర్సనల్ లోన్లపై 9.6 శాతం వడ్డీని అందిస్తుండగా గోల్డ్ లోన్ పై 7.5 […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 6, 2020 1:35 pm
    Follow us on


    దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు మరో శుభవార్త చెప్పింది. పర్సనల్ లోన్ నుంచి హోం లోన్ వరకు అదిరిపోయే ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. అయితే కస్టమర్లు ఎవరైతే లోన్ తీసుకుంటారో వారు మాత్రమే ఎస్బీఐ అందించే ప్రయోజనాలను పొందగలుగుతారు. ఇప్పటికే ప్రైవేట్ రంగ బ్యాంకులతో పోల్చి చూస్తే ఎస్బీఐ తక్కువ వడ్డీకే రుణాలను ఇస్తోంది.

    ఎస్బీఐ ప్రస్తుతం పర్సనల్ లోన్లపై 9.6 శాతం వడ్డీని అందిస్తుండగా గోల్డ్ లోన్ పై 7.5 శాతం, కార్ లోన్ పై 7.5 శాతం వడ్డీకి రుణాలను ఇస్తోంది. ఇప్పటికే రుణాలు తీసుకున్న కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని వారికి కూడా ప్రయోజనం చేకూరేలా ఎస్బీఐ నిర్ణయం తీసుకుంది. హోం లోన్ పై 6.9 శాతం వడ్డీకే రుణాలను ఇవ్వడంతో పాటు రుణాలకు ఎస్బీఐ ప్రాసెసింగ్ ఫీజును మాఫీ చేస్తోంది. దీంతో ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండానే రుణాలు పొందే అవకాశం ఉంది.

    ఎస్బీఐ కస్టమర్లు ఎవరైతే యోనో యాప్ ద్వారా లోన్ కోసం దరఖాస్తు చేసుకుంటారో వారికి 0.05 శాతం వడ్డీ తగ్గింపు అమలవుతుంది. ఎస్బీఐ కస్టమర్లు ఆన్ లైన్ లో కూడా లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గతంతో పోలిస్తే సులభంగా రుణాలు పొందే అవకాశం ఉండటంతో ఖాతాదారులకు ప్రయోజనం చేకూరుతుంది. మరోవైపు ఎస్బీఐ కొత్త సర్వీసులను అందుబాటులోకి తెస్తూ ఖాతాదారులకు మరింత చేరువ అవుతోంది.

    కొత్త కొత్త ఆఫర్లను అందుబాటులోకి తెస్తూ కస్టమర్లకు మరింత మెరుగైన సర్వీసులు అందించే దిశగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడుగులు వేస్తూ ఉండటం గమనార్హం. దరఖాస్తు చేసుకున్న ఖాతాదారులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేగంగా లోన్లను మంజూరు చేస్తోంది.