https://oktelugu.com/

అభివృద్ధిలో దూసుకెళ్తున్న ఏపీ

కరోనా సమయంలో కూడా ఏపీ ఆర్థికాభివృద్ధిలో దూసుకెళ్తోంది. కరోనా ప్రపంచం అతలాకుతలం అవుతుంతే ఏపీ మాత్రం అన్ని రంగాల్లో ముందుకెళ్తోంది. ఈ విషయం ఇండియా టుడే సర్వేలో వెల్లడైంది. వివిధ అంశాల ప్రాతిపదికగా సమాచారాన్ని సేకరించి.. ఇండియా టుడే స్టేట్‌ ఆఫ్‌ స్టేట్స్‌ పేరతో గణాంకాలను ప్రతీ ఏడాది ప్రకటిస్తోంది. ఈ ఏడాది కూడా ప్రకటించింది. పెద్దరాష్ట్రాల్ల్లో మోస్ట్‌ ఇంప్రూవ్డ్‌ కేటగిరిలో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. అస్సాం మొదటి స్థానంలో నిలిచింది. గత ఏడాది కూడా […]

Written By:
  • NARESH
  • , Updated On : November 29, 2020 / 01:47 PM IST
    Follow us on

    కరోనా సమయంలో కూడా ఏపీ ఆర్థికాభివృద్ధిలో దూసుకెళ్తోంది. కరోనా ప్రపంచం అతలాకుతలం అవుతుంతే ఏపీ మాత్రం అన్ని రంగాల్లో ముందుకెళ్తోంది. ఈ విషయం ఇండియా టుడే సర్వేలో వెల్లడైంది. వివిధ అంశాల ప్రాతిపదికగా సమాచారాన్ని సేకరించి.. ఇండియా టుడే స్టేట్‌ ఆఫ్‌ స్టేట్స్‌ పేరతో గణాంకాలను ప్రతీ ఏడాది ప్రకటిస్తోంది. ఈ ఏడాది కూడా ప్రకటించింది. పెద్దరాష్ట్రాల్ల్లో మోస్ట్‌ ఇంప్రూవ్డ్‌ కేటగిరిలో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. అస్సాం మొదటి స్థానంలో నిలిచింది. గత ఏడాది కూడా అస్సాం మొదటి స్థానంలో నిలించింది.

    Also Read: చంద్రబాబు ఆర్థిక మూలాలు దెబ్బతీసే జగన్ అస్త్రమిదే?

    రాష్ట్రాలను ఉత్తమ ప్రదర్శన (బెస్ట్‌ పెర్ఫార్మింగ్‌), అత్యుత్తమ మెరుగైన (మోస్ట్‌ ఇంప్రూవ్డ్‌), ఓవరాల్‌ కేటగిరీలుగా విభజించింది. వాటికి అనుగుణంగా స్కోర్‌ ఇచ్చింది. ఆయా విభాగాల్లో ఉత్తమ రాష్ట్రాలను విజేతలుగా పేర్కొంది.

    ఏపీ కూడా గత ఏడాది రెండో స్థానంలో నిలిచింది. కానీ టీడీపీ హయాంలో 2018లో మాత్రం ఎనిమిదో స్థానంలో నిలిచింది. అంటే వైసీపీ సర్కార్ వచ్చిన ఏడాదికే ఏపీ రెండో స్థానానికి చేరింది. ఆ స్థానాన్ని నిలబెట్టుకుంది. కరోనా కట్టడి విషయంలోనూ అస్సాం .. అద్దిరిపోయే ప్రదర్శన చేసింది. ఆంధ్రప్రదేశ్ కూడా ఏమీ తక్కువ కాదు.

    మూడో స్థానంలో నిలిచింది. అయితే కరోనా కట్టడి దేశం మొత్తం తమ వైపు చూస్తుందని వైసీపీనేతలన్నారు కానీ.. అస్సాం వైపు చూసినట్లుగా తెలుస్తోంది. మోస్ట్‌ ఇంప్రూవ్డ్‌ పెద్ద రాష్ట్రాల విభాగంలో ఆర్థిక, పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్‌ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఓవరాల్‌ బెస్ట్‌ పెర్ఫార్మింగ్‌ పెద్ద రాష్ట్రాల విభాగంలో 2018లో పదో స్థానంలో ఉంటే.. గతేడాది ఎనిమిదో స్థానానికి చేరింది. ఇప్పుడు ఏడో స్థానంలోకి వచ్చింది. మార్కెటింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ రీసెర్చ్‌ అసోసియేట్స్‌తో కలిసి ఇండియా టుడే సంస్థ ఈ ర్యాంకులు ఇస్తూ ఉంటుంది.

    Also Read: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్.. ఇకపై పది రోజులు..?

    ఓవరాల్‌ బెస్ట్‌ పెర్ఫార్మింగ్‌ పెద్ద రాష్ట్రాల విభాగంలో 2018లో పదో స్థానంలో ఉంటే.. గతేడాది ఎనిమిదో స్థానానికి చేరింది. ఇప్పుడు ఏడో స్థానంలోకి దూసుకొచ్చింది. మోస్ట్‌ ఇంప్రూవ్డ్‌ పెద్ద రాష్ట్రాల విభాగంలో 2018లో మన రాష్ట్రం ఎనిమిదో ర్యాంకులో నిలిస్తే.. గతేడాది రెండో ర్యాంకును సాధించింది. ఈ ఏడాది అదే ర్యాంకును నిలబెట్టుకుంటూ స్థిరమైన అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని ఇండియా టుడే అధ్యయనం వెల్లడించింది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్