https://oktelugu.com/

‘ఆదిపురుష్’లో కాస్ట్ కటింగ్.. మూవీపై ఎఫెక్ట్ పడుతుందా?

యంగ్ రెబల్ స్టార్.. డార్లింగ్ ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. వరుసగా భారీ ప్రాజెక్టుల్లో నటిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. ‘బాహుబలి’తో ప్రభాస్ కు వరల్డ్ వైడ్ క్రేజ్ రాగా దానిని కంటిన్యూ చేస్తూ వరుసగా ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు. Also Read: రచ్చ కంటిన్యూ.. నాగబాబు స్ట్రాంగ్ పంచ్ కు ప్రకాశ్ రాజ్ కౌంటర్..! ప్రభాస్ ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ మూవీలో నటిస్తున్నాడు. ఈమూవీ సెట్స్ పై ఉండగానే […]

Written By: , Updated On : November 29, 2020 / 01:38 PM IST
Follow us on

Adipurush

యంగ్ రెబల్ స్టార్.. డార్లింగ్ ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. వరుసగా భారీ ప్రాజెక్టుల్లో నటిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. ‘బాహుబలి’తో ప్రభాస్ కు వరల్డ్ వైడ్ క్రేజ్ రాగా దానిని కంటిన్యూ చేస్తూ వరుసగా ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు.

Also Read: రచ్చ కంటిన్యూ.. నాగబాబు స్ట్రాంగ్ పంచ్ కు ప్రకాశ్ రాజ్ కౌంటర్..!

ప్రభాస్ ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ మూవీలో నటిస్తున్నాడు. ఈమూవీ సెట్స్ పై ఉండగానే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సైంటిఫిక్ మూవీ.. బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్ తెరకెక్కిస్తున్న ‘ఆదిపురుష్’లో నటించనున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా ప్యాన్ ఇండియా లెవల్లో భారీ స్థాయిలో నిర్మాణం అవుతుండగా ‘ఆదిపురుష్’పై ఇప్పటికే అభిమానుల్లో బజ్ ఏర్పడింది.

‘ఆదిపురుష్’ మూవీ నిత్యం ఏదో ఒక అప్డేట్స్ ఇస్తూ అభిమానుల్లో అంచనాలను పెంచేస్తోంది. ‘ఆదిపురుష్’లో ప్రభాస్ రాముడిగా కన్పించనుండగా సైఫ్ అలీఖాన్ ‘లంకేష్’గా నటిస్తున్నాడు. రాముడిగా ప్రభాస్ ఫ్యాన్ మేడ్ పోస్టర్స్.. రావణుడికి సంబంధించి పోస్టర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

Also Read: విక్రమ్ నుండి క్లారిటీ.. పుష్ప బాధ పోగొట్టేవాళ్లు ఎవరో ?

అయితే ఆదిపురుష్ నిర్మాతలు ప్రస్తుతం కాస్ట్ కటింగ్ పై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. రావణుడిగా నటిస్తున్న సైఫ్ అలీఖాన్ కు ఇప్పుడు పెద్దగా క్రేజ్ లేదు. ఇక సీతగా కృతిససన్ ఎంపికైనట్లు తెలుస్తోంది. ఎందరో టాప్ హీరోయిన్లను కాదని ఆమెకు అవకాశం కల్పించడం కాస్ట్ తగ్గించడంలో భాగమేనని తెలుస్తోంది. ఇక లక్ష్మణుడి పాత్రలోనూ వర్ధమాన నటుడు సన్నీ సింగ్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఆదిపురుష్ నటీనటుల విషయంలో పొదుపు పాటిస్తూ ఆ ఖర్చును సినిమా మేకింగ్ పై పెట్టాలని భావిస్తుందనే టాక్ విన్పిస్తోంది. ‘ఆదిపురుష్’ లాంటి సినిమాల్లో కాస్టింగ్ బలంగా ఉండాల్సిందే. అయితే చిత్రయూనిట్ మాత్రం నటీనటులకు ఎంపిక కంటే సినిమా మేకింగ్ పై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. మేకింగ్ లోనూ నిర్మాతలు ఖర్చును తగ్గిస్తే మాత్రం అసలుకే ఎసరు రావడం ఖాయమనే కామెంట్స్ విన్పిస్తున్నాయి. దీనిపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే..!

మరిన్ని సినిమా వార్తల కోసం బాలీవుడ్ న్యూస్