Anand Mahindra Tweet:క్రికెట్ పేరు చెబితే చాలు.. అభిమానుల్లో, క్రీడాకారుల నరాలు జివ్వుమంటాయి. ఎన్ని పనులున్నా కొందరు పెద్దవారు సైతం క్రికెట్ ఉందంటే టీవీలకు అతుక్కుపోయేవారు ఉన్నారు. ఓ వైపు క్రికెట్ చూడడం అంటే ఇష్టమే కాదు.. ఈ ఆటను ఆడడానికి శ్రద్ధ చూపుతారు. సాధారణంగా క్రకెట్ ఆడాలంటే.. మైదానం ఉండాలి.. లేదా విశాలమైన ప్రదేశం ఉండాలి. కానీ అలాంటిదేమీ అక్కర్లేదని.. కొండలపైనా క్రికెట్ ఆడగలమని కొందరు అమ్మాయిలు నిరూపించారు. అందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోతంది.
ప్రముఖ కంపెనీ మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రా.. కంపెనీకి బాస్ గానే కాకుండా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటారు. సోషల్ మీడియాలో ఏదైనా వీడియో నచ్చితే చాలు వెంటనే స్పందిస్తారు. దానికి తన ఖాతాలో షేర్ చేస్తూ ఆకట్టుకునే మెసేజ్ లు పెడుతారు. తాజాగా ఆయన ఓ వీడియోను షేర్ చేసి కామెంట్ చేశారు. ఈ వీడియోను చూసి పలువురు ఇంప్రెస్ అవుతున్నారు. అంతేకాకుండా ఇలాక్కూడా ఆడుతారా? అని అంటున్నారు.
ఈ వీడియోలో కొందరు అమ్మాయిలో క్రికెట్ ఆడుతున్నారు. అందులో వింతేముంది? అని అనుకోవచ్చు. కానీ వారు క్రికెట్ ఆడేది ఏ మైదానంలోనో.. గల్లిలోనో కాదు.. కొండపై.. కొండమై పిచ్ ను ఏర్పాటు చేసి బ్యాటింగ్ చేస్తుంటే.. కింద రోడ్డుపై మరికొందరు అమ్మాయిలు ఫీలింగ్ చేశారు. మరికొందరు అమ్మాయిలో అక్కడకక్కడా కొండపై ఫీల్డింగ్ చేస్తున్నారు. సాధారణంగా కొండపై మాములుగానే నడవాలంటే భయపడిపోతుంటారు. అందులోనూ అమ్మాయిలు క్రికెట్ ఆడడంపై ఆసక్తి నెలకొంది.
ఈ వీడియోకు ఇంప్రస్ అయిన ఆనంద్ మహీంద్రా వెంటనే దానిని షేర్ చేశారు. అంతేకాకుండా ‘భారత్ క్రికెట్ మరోస్థాయికి తీసుకెళ్లింది’ అని ట్వీట్ చేశారు. పురుషులతో పాటుగా మహిళలు క్రికెట్ లో రాణిస్తున్నారు. వరల్డ్ కప్ ఫైనల్ వరకు వెళ్లి తిరిగి వచ్చారు. ఈ క్రమంలో మహిళలు కొండపై క్రికెట్ ఆడడాన్ని చూసి పలువురు అభినందిస్తున్నారు.
https://twitter.com/anandmahindra/status/1750011845380022476