Amit Shah: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది. కేంద్ర పథకాలను రాష్ట్ర పథకాలుగా చెప్పుకుంటూ టీఆఱ్ఎస్ చేస్తున్న కుట్రలను ఎండగట్టాలని సూచిస్తోంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ శనివారం రాష్ట్రంలో పర్యటించి నేతలకు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు వచ్చేసిన ఆయన కోర్ కమిటీ నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు.
అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణకు కూడా కేంద్రం నిధులిస్తోందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నిధులు ఇవ్వడం లేదని బదనాం చేస్తుందని పేర్కొన్నారు. కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్య పరచాల్సిన అవసరం మన మీదే ఉందన్నారు. ఈ సందర్భంగా పార్టీ అంతర్గతంగా రూపొందించిన నివేదికను ప్రస్తావిస్తూ పలు సూచనలు చేశారు. బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే క్రమంలో ప్రతి కార్యకర్త నిర్విరామంగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
Also Read: Congress Party: కాంగ్రెస్ కోలుకుంటుందా? పునర్వైభవం సాధ్యమేనా?
తెలంగాణ ఇన్ చార్జి తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ నాయకురాలు విజయశాంతిలతో ప్రత్యేకంగా భేటీ అయి పలు అంశాలు వివరించారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో అందరి సహకారం ఉండాలన్నారు. ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత మనదే. వారికి వివరిస్తూ జాగృతం చేయాల్సిన అవసరం ఉంది. దీనికి అందరు కలిసికట్టుగా పని చేసి భవిష్యత్ లో తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలని దిశా నిర్దేశం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయకున్నా అన్ని చేస్తున్నట్లు ప్రగల్బాలు పలుకుతుంది. కానీ ఏ చిన్న పని కూడా చేయడం లేదు. దానికి కేంద్రాన్ని పావుగా వాడుకుంటూ మాకు ఏం ఇవ్వడం లేదని బుకాయించడం బాగా అలవాటుగా మారింది. దీనికి మనమే ప్రజలను చైతన్యవంతులను చేసి మనం చేస్తున్న పనులను విడమర్చి చెప్పాలి. లేకపోతే టీఆర్ఎస్ చెప్పిందే నిజమని నమ్మితే మనకే దెబ్బ. అందుకే టీఆర్ఎస్ కుట్రలను వివరిస్తూ మన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వచ్చే ఎన్నికల్లో ఇక్కడ అధికారం సొంతం చేసుకోవాలని అభిలషించారు.
అంతర్గత నివేదికలతో షా పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. పార్టీని ఎలా అధికారంలోకి తీసుకురావాలో సూచించారు. టీఆర్ఎస్ ను ఎదుర్కొని అధికారం దక్కించుకోవాలంటే చాలా కష్ట పడాల్సి ఉంటుందని తెలిపారు. దీని కోసం అవసరమైతే త్యాగాలు కూడా చేయాల్సి వస్తోంది. దీనికి అందరు సిద్ధంగా ఉండి పార్టీని విజయం వైపు నడిపించాలి.
Also Read:Gadapa Gadapaku YCP: గడపగడపలోనూ నిలదీతలే.. చుక్కలు చూస్తున్న వైసీపీ నేతలు