KCR vs BJP: తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం అన్ని మార్గాలను తమకు అనుకూలంగా మలుచుకుంటోంది. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో రెండు దఫాలుగా పాదయాత్ర నిర్వహించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన పాదయాత్ర ముగింపు సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరై కేసీఆర్ విధానాలపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో నిజాం పాలన సాగుతున్నట్లు కనిపిస్తోందని చురకలంటించారు. ఏకపక్ష నిర్ణయాలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శలు చేశారు.
హుజురాబాద్ ఎన్నిక నుంచి టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ నేతలు చెబుతున్నారు. దీని కోసమే వారి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ పాలన చూశారు. ఒక్కసారి బీజేపీ పాలన కూడా చూడాలని బీజేపీ నేతలు అభ్యర్థిస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తే పెట్రోధరల తగ్గింపు, పేదలకు ఉచితంగా ఇళ్లు నిర్మించడం వంటి హామీలు అమలు చేస్తామని చెబుతున్నారు. టీఆర్ఎష్ పాలనలో ప్రజలు నిరంతరం కష్టాలు అనుభవిస్తున్నారని చెబుతున్నారు.
Also Read: Amit Shah: అంతర్గత నివేదికలతో అమిత్ షా కీలక దిశానిర్ధేశం
కేసీఆర్ కు రెండు సార్లు అధికారం కట్టబెట్టారు. కానీ ఏం చేశారు. ఎవరికి న్యాయం చేశారు? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో కనిపిస్తూనే ఉంది. అందుకే టీఆర్ఎస్ కు చరమగీతం పాడాల్సిన అవసరం ఏర్పడింది. దీనికి ప్రజలు చైతన్యమైతేనే సాధ్యమవుతుంది. ఇందు కోసం పార్టీ కార్యకర్తల నుంచి నేతల వరకు అందరు కేంద్ర పథకాలను ప్రచారం చేస్తూ అధికారంలోకి వచ్చేందుకు శ్రమించాల్సిన అవసరం గుర్తించాలి. అప్పుడే మన కల నెరవేరుతుంది.
టీఆర్ఎస్ పార్టీ నిరంకుశ విధానాలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. దీంతోనే కేసీఆర్ పాలన ఇంత దారుణంగా ఉన్నా అధికారం రెండు మార్లు దక్కించుకోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకే కుటుంబం పాలన చేయడం కూడా హాస్యాస్పదమే. ఎప్పుడో రాజుల పాలన అంతమైనా ఇక్కడ మాత్రం ఇదే విధానం కొనసాగడం విడ్డూరమే. దీనికి కేసీఆర్ ఏం సమాధానం చెబుతారు? అన్నింట్లో తనదే పైచేయి అనుకుంటూ భ్రమలో బతుకున్నారు.
రాష్ట్రంలో కేసీఆర్ ను గద్దె దించే వరకు ఊరుకోబోం. దీని కోసం ఎంతటి శ్రమకైనా సిద్ధమే. ఎన్ని త్యాగాలు చేసి అయినా అధికారం దక్కించుకుంటాం. కేసీఆర్ ను పదవీచ్యుతుడిని చేసే వరకు విశ్రమించేది లేదని చెబుతున్నారు. కానీ కేసీఆర్ ను అధికారానికి దూరం చేయడం బీజేపీకి సాధ్యమవుతుందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. మొత్తానికి రాజకీయ చదరంగంలో రెండు పార్టీల మధ్య నెలకొన్న పోరాటం ఎందాకా వెళ్తుందో చూడాలి మరి.
Also Read:Gadapa Gadapaku YCP: గడపగడపలోనూ నిలదీతలే.. చుక్కలు చూస్తున్న వైసీపీ నేతలు