https://oktelugu.com/

Congress Party: కాంగ్రెస్ కోలుకుంటుందా? పునర్వైభవం సాధ్యమేనా?

Congress Party: ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలనేది సామెత. కాంగ్రెస్ పార్టీ కూడా పూర్వ వైభవం కోసం తాపత్రయపడుతోంది. రాజస్తాన్ లోని ఉదయ్ పూర్ లో చింతన్ శిబిర్ లో కీలక నిర్ణయాలు తీసుకుని అధికారమే లక్ష్యంగా ముందుకు సాగనుంది. దీనికి గాను చేపట్టాల్సిన చర్యలపై నేతలు దృష్టి సారించారు. ఇప్పటికైనా వైఫల్యాలపై చర్చించకపోతే ఇక జీవితాంతం ప్రతిపక్షంలోనే ఉండాల్సి వస్తోందని పలువురు నేతలు వ్యాఖ్యానించడం తెలిసిందే. సరైన దిశా నిర్దేశం లేకే పార్టీ వెనుకబడిపోతోందనే వాదనలు […]

Written By:
  • Srinivas
  • , Updated On : May 15, 2022 / 08:48 AM IST
    Follow us on

    Congress Party: ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలనేది సామెత. కాంగ్రెస్ పార్టీ కూడా పూర్వ వైభవం కోసం తాపత్రయపడుతోంది. రాజస్తాన్ లోని ఉదయ్ పూర్ లో చింతన్ శిబిర్ లో కీలక నిర్ణయాలు తీసుకుని అధికారమే లక్ష్యంగా ముందుకు సాగనుంది. దీనికి గాను చేపట్టాల్సిన చర్యలపై నేతలు దృష్టి సారించారు. ఇప్పటికైనా వైఫల్యాలపై చర్చించకపోతే ఇక జీవితాంతం ప్రతిపక్షంలోనే ఉండాల్సి వస్తోందని పలువురు నేతలు వ్యాఖ్యానించడం తెలిసిందే. సరైన దిశా నిర్దేశం లేకే పార్టీ వెనుకబడిపోతోందనే వాదనలు కూడా వస్తన్నాయి.

    Congress Party

    పార్టీలకు సంక్షోభాలు సాదారణమే. కానీ కాంగ్రెస్ పార్టీ నడిసంద్రంలో మునిగిపోయే నావలాగా మారింది. దీంతో పార్టీని అధికారం దిశగా తీసుకెళ్లడం నేతల బాధ్యత అని తేల్చింది. దీని కోసం అందరు కలిసి కట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తున్నారు. 2014 ఓటమి తరువాత కోలుకోలేకపోవడంతోనే అధికారానికి దూరమైనట్లు తెలుస్తోంది. అందుకే ఆ తప్పులను సరిచేసుకుని మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.

    Also Read: Gadapa Gadapaku YCP: గడపగడపలోనూ నిలదీతలే.. చుక్కలు చూస్తున్న వైసీపీ నేతలు

    2024 ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయాల్సిన ప్రణాళికల కోసం అందరు సిద్ధ:గా ఉండాలని సూచించింది. త్వరలో జరిగే రాజస్థాన్, చత్తీస్ గడ్ ఎన్నికల్లో మళ్లీ పార్టీని అధికారంలోకి తీసుకురాకపోతే పరిస్థితులు వేరేలా ఉంటాయి. అప్రదిష్ట మూటగట్టుకోవాల్సి వస్తోందని నేతలు ప్రస్తావించారు. అందుకే పార్టీని విజయపథంలో తీసుకెళ్లే క్రమంలో చేపట్టాల్సిన విధి విధానాలు కూలంకషంగా చర్చించారు. బీజేపీని నిలువరించేందుకు అందరు తయారుగా ఉండాలని చెబుతోంది.

    మరోవైపు బీజేపీ విజయాలతో దూసుకుపోతోంది. దాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ ఏం చర్యలు తీసుకోవడం లేదు. దీంతోనే బీజేపీ అప్రతిహంగా ముందుకు వెళ్తోంది. కానీ ఈ సారి మాత్రం బీజేపీని అధికారానికి దూరం చేసి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని అభిలషిస్తోంది. దీని కోసం త్యాగాలు చేయాల్సిన అవసరం కూడా ఉందని గుర్తించాలని సూచిస్తోంది. ఒక్కో కుటుంబానికి ఒక్కే టికెట్ ఇవ్వాలని భావిస్తున్నారు. దీనికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.

    పార్టీలో యువతకు పెద్ద పీట వేయాలని నిర్ణయించింది. యువత దూరం కావడంతోనే విజయం దక్కడం లేదు. దీంతో ప్రతిసారి ఎన్నికల్లో వెనుకబడిపోతున్నాం. అందుకే ఈ సారి యువతకు ప్రాధాన్యం ఇచ్చి వారికి ఎక్కువగా టికెట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలి. సీనియర్లు త్యాగాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

    congress party

    కొందరు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తుంటే సీనియర్లు మాత్రం గాంధీయేతర కుటుంబానికి బాధ్యతలు అప్పగించాలని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీని ఎలా గట్టెక్కించాలనే దానిపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. భవిష్యత్ లో పార్టీని గాడిలో పెట్టేందుకు చేపట్టాల్సిన వ్యూహాలపై దృష్టి సారించారు.

    కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న చర్యలు ప్రతిఫలం కలిగిస్తాయా? పార్టీకి మళ్లీ అధికారం కట్టబెడుతుందా? చింతన్ శిబిర్ ప్రయోజనం కలిగిస్తుందా? పార్టీకి పూర్వ వైభవం వస్తుందా అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ లో అధికారం చేజిక్కించుకోవడం ఖాయమనే ధీమా నేతల్లో వ్యక్తమవుతోంది.

    Also Read:Swaroopananda Swamy: సుబ్బారెడ్డి కంటే కరుణాకర్ రెడ్డి సో బెటర్.. స్వరూపనంద స్వామిజీ పొగడ్తల వర్షం

    Tags