Homeజాతీయ వార్తలుAmit Shah, Rahul Are Political Tourists: అమిత్ షా, రాహుల్ పొలిటికల్ టూరిస్టులు.. మరి...

Amit Shah, Rahul Are Political Tourists: అమిత్ షా, రాహుల్ పొలిటికల్ టూరిస్టులు.. మరి కేసీఆర్?

Amit Shah, Rahul Are Political Tourists:: తాను చేస్తే శృంగారం.. పక్కవాడు చేస్తే వ్యభిచారం అనేది సామెత. ఎవరు తవ్వుకున్న గోతిలో వారే పడతారు. చెరపకురా చెడేవు అని చెబుతుంటారు. ప్రస్తుతం రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్ బీజేపీ, కాంగ్రెస్ లపై విమర్శలు చేయడంతో ఇప్పుడే అదే ముప్పుగా పరిణమిస్తోంది. వీరు చేసిన వ్యాఖ్యలకు వీరే బాధ్యులుగా నిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పూలమ్మిన చోటే కట్టెలమ్మాల్సి వస్తోంది. చేసిన విమర్శలకు వారే టార్గెట్ కావడంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.

కేంద్ర మంత్రి అమిత్ షా బీజేపీ సంగ్రామ యాత్ర ముగింపు సభ తుక్కుగూడలో జరగడంతో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ రైతు సంఘర్షణ సభ వరంగల్ ల నిర్వహించగా ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. వీరిని టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా పొలికల్ టూరిస్టులుగా అభివర్ణించారు. రాష్ట్రానికి అతిథులు వస్తుంటారు పోతుంటారు. కానీ కేసీఆర్ లోకల్ అంటూ విమర్శలు చేశారు. దీంతో వారు కూడా ఏం మాట్లాడలేదు.

Amit Shah, Rahul Are Political Tourists
Amit Shah, Rahul

ప్రస్తుతం కేసీఆర్ ఉత్తర భారతదేశ యాత్ర చేస్తున్నారు. మూడో కూటమి ఏర్పాటులో భాగంగా యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఇతర నేతలను కలుస్తున్నారు. ఈనెల 26న కర్ణాటక వెళ్లి మాజీ ప్రధాని దేవెగౌడ, కుమారస్వామి వంటి నేతలను కలవనున్నట్లు తెలుస్తోంది. ఇంకా పశ్చిమబెంగాల్ కు కూడా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. మూడో కూటమి ఏర్పాటులో భాగంగా ఆయన దేశ వ్యాప్త యాత్ర చేస్తున్నారు.

Amit Shah, Rahul Are Political Tourists
KCR Political Tourists

Also Read: Indravathi Chauhan : ‘ఊ అంటావా’ అనడమే కాదు.. అందంతో ఊపేయడం ఈ సింగర్ కు తెలుసు!

దీనిపై ప్రతిపక్షాలు బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. ఇక్కడకొచ్చిన అమిత్ షా, రాహుల్ గాంధీ పొలిటికల్ టూరిస్టులైతే ప్రస్తుతం కేసీఆర్ ఎవరు? అని ప్రశ్నిస్తున్నారు. ఎవరినైనా నిందించే ముందు మనమేంటో కూడా ఆలోచించుకోవాలి. అంతేకాని నోటికొచ్చినట్లు మాట్లాడితే పరిస్థితి ఇలాగే ఉంటుంది. దీనిపై మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, శ్రీనివాస్ యాదవ్ ఏం సమాధానాలు చెబుతారో అని వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు.

తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ తమ తప్పులను చూసుకోకుండా ఇతరులపై నిందలు వేస్తూ దొరికిపోతోంది. తామేది చేస్తున్నా లెక్కలోకి రాదు కానీ ఇతరులు చేస్తే అది తప్పుగా ఎలా పరిగణిస్తారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ తీరుపై అందరిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దేశమంతా పర్యటిస్తున్న కేసీఆర్ పర్యటనపై మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ ఇరుకున పడినట్లు తెలుస్తోంది.

Also Read: Super Singer Junior: అనసూయతో సుడిగాలి సుధీర్.. ప్రేక్షకులకు పండుగే

Recommended Videos:

https://www.youtube.com/watch?v=iUtvpRtc5hE&t=11s

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular