YSRCP Plenary-2022: అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా వైసీపీ ప్లీనరీ జరుగుతోంది. 2017లో చివరిసారిగా ప్లీనరీ నిర్వహించారు. ఒక విధంగా చెప్పాలంటే వైసీపీకి ఆ ప్లీనరే మలుపు అంటారు. నవరత్నాలతో పాటు పాదయాత్ర వంటి కీలక నిర్ణయాలు వంటివి అప్పుడే వెలువడ్డాయి. అటు తరువాత జగన్ పాదయాత్రతో ప్రజలబాట పట్టారు. నవరత్నాలపై విస్త్రుతంగా ప్రచారం జరిగింది. ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దాని ఫలితమే 2019 ఎన్నికల్లో వైసీపీ అద్భుత విజయం. సంఖ్యాబలంగా శక్తివంతమైన స్థితిలో ఉన్న వైసీపీ ప్రభుత్వంపై ఇటీవల ప్రజా వ్యతిరేకత పెల్లుబికింది. అటు విపక్షాలు సైతం విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. రాష్ట్రం ఆర్థికంగా దివాళా దిశగా పయనిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొలదీ మరింత పెరుగుతున్నాయి. అదే సమయంలో విపక్షాలు ఐక్యతారాగాన్ని ఆలపిస్తున్నాయి. ప్రధానంగా టీడీపీ, జనసేన కూటమి రూపంలో సవాల్ ఎదురవుతోంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ పుంజుకోవడం, పవన్ కు ఆదరణ పెరుగుతుండడంతో అధికార పార్టీలో కలవరం ప్రారంభమైంది. ఇటీవల వరుస పరిణామాలు కూడా వైసీపీకి ప్రతిబంధకంగా మారాయి. టీడీపీ మహానాడుకు జనం పోటెత్తడం, చంద్రబాబు సభలకు స్వచ్ఛందంగా తరలిరావడం, పవన్ కూడా దూకుడు పెంచడం వంటివి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అటు సొంత పార్టీలో కూడా ఎన్నడూ లేనంతగా విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో జరుగుతున్న ప్లీనరీలో చాలా సందేహాలను పార్టీ అధినేత జగన్ నివ్రుత్తి చేయనున్నారని వైసీపీ వర్గాలు చెబుతూ వచ్చాయి. అయితే ఆ తరుణం రానే వచ్చింది. పార్టీ అధ్యక్షుడి హోదాలో జగన్ ప్రసంగించారు. నాటి పార్టీ ఆవిర్భావం నుంచి జరిగిన పరిణామాలను మరోసారి గుర్తుచేస్తూ శ్రేణుల నుంచి అభిమానాన్ని చూరగొనే ప్రయత్నం చేశారు.
గుంటూరు నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా జరుగుతున్న ప్లీనరీని ఉద్దేశించి జగన్ స్వాగతోపన్యాసం చేశారు. 13 ఏళ్ల సుదీర్ఘ కాలంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. ఈ ప్రయాణంలో ఎన్ని ముళ్లు ఎదురైనా, ఎన్ని రాళ్లు పడినా తట్టుకున్నామని చెప్పారు. నాడు మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో జరిగిన విషయాలను ప్రస్తావించారు. కాంగ్రెస్ పేరు ప్రస్తావించకుండానే వ్యవస్థలతో ఎలా నెట్టుకొచ్చారో.. ఎలా ఉక్కుపాదం మోపారో అందరికీ తెలిసిందేనన్నారు. కానీ వాటన్నింటిని తట్టుకున్నమని చెప్పారు. 2014 పార్టీ ఆవిర్భావం నుంచి ఎదురైనా పరిస్థితులను ఏకరవు పెట్టారు.
Also Read: YS Vijayamma: అమ్మ రాజీనామా!.. షర్మిలకే జై.. జగన్ కు నై.. వైఎస్సార్‌సీపీకి విజయమ్మ గుడ్‌బై!
వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎలా కొనుగోలు చేశారో గుర్తుచేసుకున్నారు. కానీ సంకల్ప బలంతో ముందుకు సాగినట్టు స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో దేశంలోనే కనివినీ ఎరుగని అంతులేని విజయాన్ని అందించారని.. ఇది మీరిచ్చిన విజయమేనంటూ శ్రేణులకు అంకితమిచ్చారు.ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నతన చేయి విడవలేదన్నారు. కార్యకర్తల మనో బలం, దేవుడు ఆశీస్సులతో 151 స్థానాలను గెలుపొందినట్టు చెప్పారు. నాడు తెలుగుదేశం పార్టీ కొనుగోలు చేసిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలతో ఆ పార్టీ బలం నిలిచిపోయిందన్నారు. ఇది ముమ్మాటికీ దైవ నిర్ణయంగా చెప్పుకొచ్చారు.
తనకు వైసీపీ మేనిఫెస్టో భగవద్గీత, ఖురాన్, బైబిల్ తో సమానమని జగన్ ప్రకటించారు. ఈ రాష్ట్రంలో చాలా ప్రభుత్వాలు వచ్చాయని.. అవి ప్రకటించిన మేనిఫెస్టోలను చెత్త బుట్టలో పడేసిన చరిత్ర ఉందన్నారు. కానీ అధికారమనేది అహంకారం కాదు.. ప్రజలపై మమకారమని గుర్తుకు తెచ్చుకొని మరీ పాలన అందిస్తున్నట్టు తెలిపారు. కానీ విపక్షాలు తన ప్రభుత్వపై కుట్ర పన్నుతున్నయాని ఆరోపించారు.
Also Read:Pawan Kalyan- Jagan Navaratnalu: జగన్ నవరత్నాలపై పవన్ కళ్యాణ్ ‘నవసందేహాలు’.. వైరల్