Alapati Raja : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో( graduate MLC elections) టిడిపి కూటమి సూపర్ విక్టరీ సాధించింది. గుంటూరు-కృష్ణా జిల్లాల పట్టబద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయం సాధించారు. ఏడో రౌండ్ ముగిసే సరికి ఆయనకు లక్ష 18 వేల 70 ఓట్లు వచ్చాయి. 2,41, 491 ఓట్లు పోల్ కాగా.. 21 577 చల్లని ఓట్లుగా గుర్తించారు. 50 శాతానికి పైగా ఆలపాటి ఓట్లు సాధించడంతో విజేతగా ప్రకటించారు అధికారులు. ఏడు రౌండ్లు ముగిసేసరికి ఆలపాటి 67,252 ఓట్ల మెజారిటీ సాధించారు. దీంతో విజేతగా ఆలపాటి రాజాను డిక్లేర్ చేశారు.
* సీనియర్ నేత
ఆలపాటి రాజేంద్రప్రసాద్( alapati Rajendra Prasad ) సీనియర్ మోస్ట్ లీడర్. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగుతూ వచ్చారు. 1994 లో జరిగిన ఎన్నికల్లో వేమూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1999లో సైతం అదే నియోజకవర్గము నుంచి ఎన్నికయ్యారు. చంద్రబాబు మంత్రివర్గంలో రెండేళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. 2004లో మాత్రం ఓడిపోయారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన కావడంతో తెనాలి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. 2009లో ఓడిపోయిన ఆయన 2014లో మాత్రం గెలిచారు. 2019లో ఆయనకు ఓటమి తప్పలేదు.
* చివరి నిమిషంలో మనోహర్ కు ఛాన్స్
ఈ ఎన్నికల్లో తెనాలి( Tenali) నుంచి మరోసారి పోటీ చేయాలని భావించారు ఆలపాటి రాజేంద్రప్రసాద్. కానీ జనసేన కీలక నేతగా ఉన్న నాదెండ్ల మనోహర్ ఆ నియోజకవర్గ టికెట్ దక్కించుకున్నారు. అయితే అప్పటివరకు ప్రత్యర్థులుగా ఉన్న ఆ ఇద్దరు నాయకులు ఏకమయ్యారు. జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన మనోహర్ కు అన్ని విధాలుగా సహకరించారు ఆలపాటి రాజా. ఇప్పుడు ఆలపాటి రాజా ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంలో కూడా నాదెండ్ల మనోహర్ కీలక పాత్ర పోషించారు. మొత్తానికైతే ఎమ్మెల్యే సీటు వదులుకున్న ఆలపాటి రాజా.. ఎమ్మెల్సీ గా ఎన్నిక కావడం విశేషం.
Also Read : ఏపీలో మరో పోరు.. శాసనమండలి గ్రీన్ సిగ్నల్.. నోటిఫికేషన్ జారీ!
* అనేక రకాలుగా ప్రచారం
ఆలపాటి రాజా( alapati Raja ) విషయంలో అనేక రకాలుగా ప్రచారం నడిచింది. ఆయన ఎన్నిక కష్టమని అంతా భావించారు. కూటమి పార్టీల ఎమ్మెల్యేలు సహకరించడం లేదని కూడా ప్రచారం జరిగింది. ఆలపాటి రాజా అభ్యర్థిత్వాన్ని ధూళిపాళ్ల నరేంద్ర, నాదేండ్ల మనోహర్ లాంటి నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ దానికి భిన్నంగా సూపర్ విక్టరీ సాధించారు ఆలపాటి రాజేంద్రప్రసాద్.
Also Read : ఎంఎల్‌సి ఎన్నికల్లో గెలుపెవరిది..?