https://oktelugu.com/

మాఫియా డాన్ దావూద్ గ్యాంగ్ తో అక్షయ్ కు సంబంధాలు?

ప్రస్తుతం బాలీవుడ్ లో దూసుకుపోతున్న హీరో అక్షయ్ కుమార్. హిందీ హీరోల్లో అందరికంటే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరో అక్షయ్ కుమారే..అంతేకాదు.. ప్రధాని కరోనా సాయం అడిగితే ఏకంగా 30 కోట్ల దాకా సాయం చేశాడు. ముంబై కార్పొరేషన్ కు పంచిపెట్టాడు. దాదాపు 50 కోట్ల వరకు సాయం చేసి అక్షయ్ కుమార్ హిందీ హీరోల్లోనే మనసున్న హీరోగా గుర్తింపు పొందాడు. బీజేపీకి, మోడీకి అత్యంత ప్రియమైన హీరోగా అక్షయ్ ఉన్నాడు. అయితే అలాంటి అక్షయ్ పై […]

Written By:
  • NARESH
  • , Updated On : September 11, 2020 / 03:15 PM IST

    Akshay davud

    Follow us on


    ప్రస్తుతం బాలీవుడ్ లో దూసుకుపోతున్న హీరో అక్షయ్ కుమార్. హిందీ హీరోల్లో అందరికంటే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరో అక్షయ్ కుమారే..అంతేకాదు.. ప్రధాని కరోనా సాయం అడిగితే ఏకంగా 30 కోట్ల దాకా సాయం చేశాడు. ముంబై కార్పొరేషన్ కు పంచిపెట్టాడు. దాదాపు 50 కోట్ల వరకు సాయం చేసి అక్షయ్ కుమార్ హిందీ హీరోల్లోనే మనసున్న హీరోగా గుర్తింపు పొందాడు. బీజేపీకి, మోడీకి అత్యంత ప్రియమైన హీరోగా అక్షయ్ ఉన్నాడు. అయితే అలాంటి అక్షయ్ పై తాజాగా పెద్ద పిడుగు పడింది.

    Also Read: సుశాంత్ కేసు: రియాకు షాకిచ్చిన ముంబై కోర్టు

    అక్షయ్ కుమార్ వ్యక్తిగత  లాయర్ అయిన అడ్వకేట్ విబోర్ ఆనంద్ తాజాగా అక్షయ్ కుమార్ కు ‘డి’ గ్యాంగ్ తో సంబంధాలు ఉన్నాయని ట్విట్టర్ లో పోస్టు పెట్టడం బాలీవుడ్ లో సంచలనమైంది.  అక్షయ్ కుమార్ తో ముంబై అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ తో సంబంధాలు ఉన్నాయా? అన్న ఒక ఫొటోను షేర్ చేశాడు..‘అక్షయ్ కుమార్ ఎందుకు వాళ్లను కలిశాడు? పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్స్ వాళ్లతో అక్షయ్ కుమార్ కు ఏం పని’ అని అక్షయ్ లాయర్ చేసిన ట్వీట్ ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది.  ఈ ఫొటో అంతర్జాతీయ స్థాయిలో ఇప్పుడు వైరల్ అయ్యింది.

    అక్షయ్ కుమార్ ను అభిమానించే బీజేపీ సహా ఫ్యాన్స్ అంతా పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. ఎంతో సాయం చేసే అక్షయ్ కుమార్ ఇలాంటి వాడు అని మేము ఊహించలేదు అని..   పాకిస్తాన్ ఐఎస్ఐ వాళ్లతో కలిసి ఫొటో దిగడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.ఈ విషయంలో పెద్ద ఎత్తున అక్షయ్ కుమార్ ను ట్రోల్ చేస్తున్నారు.

    Also Read: బాహుబలిని మించి ప్రభాస్ ‘ఆదిపురుష్’ మాయజాలం..

    అయితే అక్షయ్ లాయర్ చేసిన పోస్ట్ లో ఫొటోలు నిజమా కాదా అన్నది మాత్రం పూర్తి స్థాయిలో తెలియదు.. కానీ దేశవ్యాప్తంగా అక్షయ్ కుమార్ కు డీ గ్యాంగ్ తో సంబంధాలు ఉన్నాయని ఆ ఫొటో వైరల్ అవుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది.