సుశాంత్ కేసు: రియాకు షాకిచ్చిన ముంబై కోర్టు

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు మిస్టరీని తలపిస్తోంది. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడా? లేదా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా? అని తేల్చాల్సిన పోలీసులు పక్కదారి పడుతున్నారన్న చర్చ సాగుతోంది. ఈ కేసుతో డ్రగ్ లింకులు బయటపడటంతో పోలీసులు ప్రధానంగా వాటిపైనే ఫోకస్ పెట్టి అసలు విషయాన్ని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. Also Read: బాహుబలిని మించి ప్రభాస్ ‘ఆదిపురుష్’ మాయజాలం.. సుశాంత్ సింగ్ ఆత్మహత్య.. డ్రగ్ కేసుతో సంబంధం ఉన్న […]

Written By: NARESH, Updated On : September 11, 2020 3:40 pm

Riya chakravarthy

Follow us on

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు మిస్టరీని తలపిస్తోంది. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడా? లేదా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా? అని తేల్చాల్సిన పోలీసులు పక్కదారి పడుతున్నారన్న చర్చ సాగుతోంది. ఈ కేసుతో డ్రగ్ లింకులు బయటపడటంతో పోలీసులు ప్రధానంగా వాటిపైనే ఫోకస్ పెట్టి అసలు విషయాన్ని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.

Also Read: బాహుబలిని మించి ప్రభాస్ ‘ఆదిపురుష్’ మాయజాలం..

సుశాంత్ సింగ్ ఆత్మహత్య.. డ్రగ్ కేసుతో సంబంధం ఉన్న రియా చక్రవర్తిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి కస్టడీకి తరలించారు. అంతకముందే ఈ కేసుతో సంబంధం ఉన్న రియాచక్రవర్తి సోదరుడు షోవిక్, సావంత్, శామ్యూల్ మిరిండా, అబ్బుల్ బాసిత్ లను పోలీసులు అరెస్టు చేశారు. వీరి విచారణలో అనేక సంచలన విషయాలు బయటికి వచ్చాయి.

డ్రగ్ కేసులో కోర్టు ఇప్పటికే రియా చక్రవర్తికి ఈనెల 22వరకు జ్యుడియల్ కస్టడీ విధించింది. ఆమెను పోలీసులు బైకుల్లా జైలులో ఉంచారు. అయితే రియా చక్రవర్తితోపాటు నిందితులు ముంబై కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ ముంబై కోర్టు తోసిపుచ్చింది. రియాతోపాటు మిగిలిన నలుగురు పెట్టుకున్న పిటిషన్ ను ముంబై ప్రత్యేక కోర్టు తాజాగా కోర్టువేసి వారందరికీ షాకిచ్చింది.

రియా చక్రవర్తి డ్రగ్స్ తో సంబంధం ఉన్న బాలీవుడ్లోని 25మంది ప్రముఖుల పేర్లు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె ఫోన్, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రియా, మిగతా నిందితులు చెప్పిన వివరాలను ప్రకారం పోలీసులు ఇప్పటికే బాలీవుడ్లోని సెలబ్రెటీలకు విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపించారు.

Also Read: ఫస్ట్ లుక్: సాధారణ గృహణిలా వెటరన్ బ్యూటీ శ్రియ..!

ఇప్పటికే పలువురి విచారించి అరెస్టు చేసినట్లు సమాచారం. సుశాంత్ ఆత్మహత్యతో దిగాలు చెందిన బాలీవుడ్ ఇండస్ట్రీకి డ్రగ్ కేసు భయాందోళనకు గురిచేస్తోంది. బాలీవుడ్లో ఎప్పుడెవరు అరెస్టవుతారోననే టెన్షన్ ప్రతీఒక్కరి నెలకొంది.