https://oktelugu.com/

స్పృహ తప్పిన అఖిల.. ఇంకా పరారీలోనే భార్గవ్‌

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో ఏపీ టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియను, ఆమెకు సహకరించిన ఏవీ సుబ్బారెడ్డిని హైదరాబాద్‌ పోలీసులు బుధవారం అరెస్ట్‌చేశారు. అఖిలప్రియను వైద్యపరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించగా ఆమెను చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు. సీపీ అంజనీకుమార్‌ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. Also Read: కుప్పలుగా చచ్చిపోయిన పక్షులు.. తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం తెలంగాణలో ఇలాంటి కిడ్నాప్‌లు, వ్యవస్థీకృత నేరాలకు […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 7, 2021 10:00 am
    Follow us on

    Akhila Priya Husband
    బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో ఏపీ టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియను, ఆమెకు సహకరించిన ఏవీ సుబ్బారెడ్డిని హైదరాబాద్‌ పోలీసులు బుధవారం అరెస్ట్‌చేశారు. అఖిలప్రియను వైద్యపరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించగా ఆమెను చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు. సీపీ అంజనీకుమార్‌ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు.

    Also Read: కుప్పలుగా చచ్చిపోయిన పక్షులు.. తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం

    తెలంగాణలో ఇలాంటి కిడ్నాప్‌లు, వ్యవస్థీకృత నేరాలకు తావులేదని, ఎంతటి వారైనా చట్టం ముందు సమానులేనని హెచ్చరించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఏవీ సుబ్బారెడ్డిని, రెండో నిందితురాలిగా అఖిలప్రియ, మూడో నిందితుడిగా ఆమె భర్త భార్గవరాంను చేర్చామని చెప్పారు. కిడ్నాప్‌ చేసిన వారిలో శ్రీనివాస్‌ చౌదరీ అలియాస్‌ గుంటూరు శ్రీను, సాయి, చంటి, ప్రకాశ్‌ను గుర్తించామని, మరింత మందిని గుర్తించాల్సి ఉన్నదని పేర్కొన్నారు. దర్యాప్తులో భాగంగా బుధవారం ఉదయం అఖిలప్రియను కూకట్‌పల్లిలోని ఆమె నివాసంలో అదుపులోకి తీసుకొన్నామని, సుబ్బారెడ్డిని కూడా ఆయన నివాసంలో అరెస్టు చేసినట్టు వివరించారు. సమావేశంలో నార్త్‌జోన్‌ డీసీపీ కల్మేశ్వర్‌, టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావు, అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మి, నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వర్‌రావు, బోయిన్‌పల్లి ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ పాల్గొన్నారు.

    అఖిలప్రియను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచే ముందు బోయిన్‌పల్లి పోలీసులు వైద్యపరీక్షల నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. ఆమె అక్కడ స్పృహ తప్పి పడిపోగా, మహిళా డాక్టర్లు వైద్యపరీక్షలు నిర్వహించారు. రిపోర్టులన్నీ సాధారణంగా ఉండటంతో రాత్రి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించగా, పోలీసులు ఆమెను చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు. అఖిలప్రియ గర్భవతి కావడం, పిట్స్‌ కూడా వచ్చినట్లు దాని వల్ల దవాఖానలో నీరసంతో స్పృహ కోల్పోయినట్టు సమాచారం.

    Also Read: కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసు: ఏ1 ఏవీ సుబ్బారెడ్డి అరెస్ట్.. కొనసాగుతున్న వేట

    ఈ కిడ్నాప్‌లో పాల్గొన్న వారంతా జీవితంలో స్థిరపడిపోయేలా భారీ నజరానాలు ఇస్తానని అఖిలప్రియ హామీ ఇచ్చినట్టు సమాచారం. కిడ్నాప్‌లో ప్రధాన సూత్రదారిగా ఉన్న శ్రీనివాస్‌ చౌదరీ, సాయి, చంటి, ప్రకాశ్‌లు అఖిలప్రియ కుటుంబంతో కొన్నేండ్లుగా ప్రధాన అనుచరులుగా ఉంటున్నారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ కిడ్నాప్‌ వ్యవహారానికి పది రోజుల నుంచి రెక్కీ జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. కిడ్నాప్‌ అనంతరం దర్యాప్తును దారి మళ్లించేలా నగరంలో వివిధ రూట్లలో తిరిగినట్టు పోలీసులు పేర్కొన్నారు. కిడ్నాప్‌ జరిగేవరకు బంజారాహిల్స్‌లో ఉన్న అఖిలప్రియ, కిడ్నాప్‌ జరిగిందని నిర్ధారించుకొని కూకట్‌పల్లిలోని తన నివాసానికి వెళ్లి, అక్కడి నుంచి కొత్త ఫోన్‌ నంబర్లతో కిడ్నాపర్లతో మాట్లాడారు.

    సినీ ఫక్కీలో జరిగిన ఈ కిడ్నాప్ కేసులో ట్విస్‌ల మీద ట్విస్ట్‌లు చోటు చేసుకున్నాయి. భూమా అఖిల ప్రియను అదుపులోకి తీసుకోవడం..ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడం చకచకా జరిగిపోయాయి. అనంతరం ఆమెను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. గురువారం అఖిల ప్రియ బెయిల్ పిటిషన్‌పై కోర్టులో విచారణ జరగనుంది. కాగా.. అఖిల్ ప్రియ భర్త భార్గవ్ రామ్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు 15 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. మరో నిందితుడు ఏవి సుబ్బారెడ్డికి 41ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చి వదిలేశారు పోలీసులు. భార్గవ్ అరెస్ట్ తర్వాత వైవి సుబ్బారెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉంది. ఐటీ అధికారులుగా ప్రవీణ్ రావు ఇంట్లో చొరబడిన వారి కోసం గాలింపు ప్రక్రియ కొనసాగుతోంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్