Delhi: దేశరాజధాని ఢిల్లీ ప్రజలు దీపావళి పండుగ వేళ.. సమస్యలతో సతమతమవుతున్నారు. ఒకవైపు వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కరి చేస్తోంది. ఇంకోవైపు నీటి ఎద్దడితో ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో టపాసులు కాల్చడాన్ని ప్రభుత్వం ఇప్పటికే నిషేధించింది. కాలుష్య నియంత్రణక చర్యలు చేపట్టింది. కానీ, గాలి నాణ్యత పడిపోతూనే ఉంది. ఊపిరి తీసుకోవడానికి కూడా రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గాలి నాణ్యత (ఏక్యూఐ) 400గా నమోదైంది. ఇక తాజాగా నీటి సమస్య తలెత్తింది. అక్టోబర్ 31 వరకు నీటి సరఫరా అంతంత మాత్రంగానే ఉంటుందని ఢిల్లీ జల్ బోర్డు ప్రకటించింది. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
నీటి ఎద్దడి..
అక్టోబర్ 31 వరకు ఢిల్లీలోని 60కిపైగా ప్రాంతాలకు నీటిసరఫరా నిలిచిపోతుందని ఢిల్లీ జల్‌బోర్డు తెలిపింది. నగరానికి పలు వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నుంచి తాగునీరు సరఫరా అవుతోంది. 110 ఎంజీడీ భార్గతి ప్లాంట్, 140 ఎంజీడీ సోనియా విహార్ ప్రాంటకు నీరు ప్రధానంగా గంగా కెనాల్ నుంచి వస్తుంది. అయితే యూపీ నీటిపారుదల బోర్డు దీనికి అక్టోబర్ 12 నుంచి 31 వరకు మెయింటనెన్స్, మరమ్మతులు చేస్తోంది. దీంతో నీటి సరఫరా నిలిచిపోయింది. ప్లాంట్లు మూసివేశారు. ఇక ఢిల్లీలోని యమునా నదిలో అమ్మెనియా స్థాయి ఎక్కువగా ఉంది. నీటి ఎద్దడి నివారణకు యమునా నీటిని సరఫరా చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలక ఇబ్బందలు ఎదురవుతుఆన్నయి. దీంతో ఢిల్లీ అంతటా నీటిఎద్దడి నెలకొంది. అత్యవసరమైన ప్రాంతాలకు ట్యాంకర్లతో ప్రభుత్వం నీరు సరఫరా చేయిస్తోంది.
ఊపిరి ఆడని ఢిల్లీ..
ఇక ఢిల్లీలో వాయు కాలుష్యం కూడా రోజు రోజుకూ తీవ్రం అంవుతోంది. పొరుగున ఉన్న హర్యానా, పంజాబ్ నుంచి వస్తున్న వ్యర్థాల పొగ ఢిల్లీని కమ్మేస్తోంది. దీనికితోడు పొగమంచు కూడా దేశ రాజధాని వాసులను ఇబ్బంది పెడుతోంది. నగర ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ డేంజర్ స్థాయికి పడిపోయింది. సోమవారం(అక్టోబర్ 28న) ఏక్యూ 328గా నమోదైంది. ఆనంద్ విహార్ ప్రాంతంంలో గాలి ప్రమాదకరంగా మారింది. ఇక్కడ ఉదయం 7 గంటలకు 357గా ఏక్యూఐ ఉంది. అక్షర్‌ధామ్ ఆలయవ వద్ద కూడా ఇదే పరిస్థితి.